Dolly Shivani Cherukuri | national record | archery

Two year old sets national archery record

Two-year-old sets national archery record, new national record in archery, Shivani youngest Indian to score 200 points, Shivani enters India Book of Records, Starling little ,Dolly Cherukuri Shivani, Archery coach Cherukuri sathynarayana, Shivani Cherukuri, India Book of Records, Biswaroop Roy Chowdhury, archery

Two-year-old Dolly Shivani Cherukuri, set a new national record in archery, on Tuesday, becoming the youngest Indian to score 200 points over five and seven-metre distances according to Biswaroop Roy Chowdhury of the India Book of Records.

అర్చరీలో రికార్డులను తిరగరాసిన చిన్నారి శివాని

Posted: 03/25/2015 09:00 PM IST
Two year old sets national archery record

ఆర్చరీలో ఘనమైన వారసత్వాన్ని పుట్టుకతోనే పునికి పుచ్చుకుంది ఈ చిన్నారి.  రెండు సంవత్సరాల 11 నెలల వయస్సులోనే చిన్నారి డాలీ శివాని  అరుదైన ఘనత సాధించింది. విజయవాడకు చెందిన ప్రఖ్యాత ఆర్చర్, కోచ్ దివంగత చెరుకూరి లెనిన్ సోదరైన డాలీ తన ప్రావీణ్యంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. గురి తప్పకుండా 5మీ., 7మీ., దూరంలో బాణాలు విసిరి 388 పాయింట్లను సాధించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డులకెక్కింది.

ఇండియా బుక్ ప్రతినిధుల సమక్షంలో డాలీ శివానీకి 7 మీటర్ల దూరంలో టార్గెట్ ఫేస్ (122 సెం., ఎత్తు 166 సెం., 90 డిగ్రీలు), అలాగే 5 మీటర్ల దూరంలో టార్గెట్ ఫేస్ (80 సెం. ఎత్తు మీటర్లు, 166 సెం.)లో లక్ష్యాలను ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగానికి 36 బాణాల చొప్పున 72 బాణాలు ఇచ్చారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకునేందుకు 200 పాయింట్లు వస్తే సరిపోతుంది. అయితే 7 మీటర్ల టార్గెట్‌లో 199, 5 మీటర్ల డిస్టెన్స్‌లో 189 పాయింట్లతో మొత్తం 388 పాయింట్లను కైవసం చేసుకుని ఔరా అనిపించుకుంది. శివానికి బంగారు పతకంతో పాటు సర్టిఫికెట్ అందించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivani Cherukuri  India Book of Records  Biswaroop Roy Chowdhury  archery  

Other Articles