Pankaj advani won world billiards championship triumph against peter gilchrist

pankaj advani latest news, pankaj advani world billards championship, pankaj advani medals, pankaj advani games, pankaj advani snooker game

pankaj advani won World Billiards Championship triumph against the dangerous player peter gilchrist

కొత్త చరిత్ర సృష్టించిన అద్వానీ!

Posted: 10/25/2014 03:22 PM IST
Pankaj advani won world billiards championship triumph against peter gilchrist

భారత స్టార్ క్యూయిస్ట్ అయిన పంకజ్ అద్వానీ ఇంతవరకు ఎన్నడూలేని విధంగా ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ లో టైటిల్ ను సంపాదించాడు. శుక్రవారం లీడ్స్ లో జరిగిన 150 అప్ పాయింట్స్ ఫార్మేట్ ఫైనల్లో అద్వానీ ఏ ఆటగాడు సాధించని స్కోరుతో అందరికీ షాకిచ్చాడు. సింగపూర్ కు చెందిన మాజీ ఛాంపియన్ పీటర్ గిల్ క్రిస్ట్ తో తలపడిన అద్వానీ.. 6-2 ఫ్రేములతో ఓడించాడు. లీగ్ దశలో పీటర్ చేతిలో పరాజయం చవిచూసి అద్వానీ.. ఈసారి మాత్ర ఎటువంటి తప్పులకు తావీయకుండా తన సత్తా చాటుకున్నాడు.

మ్యాచ్ ప్రారంభమైన మొదట గిల్ క్రిస్ట్ 2-1 స్కోరుతో ఆధిక్యంలో దూసుకెళ్లాడు. అతడు ప్రదర్శించిన దూకుడును చూసి అందరూ అద్వానీ ఓడిపోతాడని అనుకున్నారు. కానీ అప్పటినుంచి పుంజుకున్న అద్వానీ 2-2తో స్కోరును సమం చేసి.. ఆధిక్యంలోకి దూసుకెళ్లిపోయాడు. ఆ జోరుతోనే తన ఆటతీరును ప్రదర్శించిన అతడు.. వరుసగా 4 ఫ్రేములు గెలిచి టైటిల్ సాధించాడు. ఈ గేమ్ కన్నా ముందు జరిగిన సెమీస్ లో కూడా ఇటువంటి ఆటతీరుతోనే అద్వానీ 5-2 ఫ్రేములతో సౌరవ్ కొఠారిపై విజయం సాధించాడు.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కెరీర్ లో పంకజ్ కు ఇది పదకొండో ప్రపంచ టైటిల్ కావడం విశేషం. అలాగే ఈ ఏడాదిలోనే అతడు మూడు ప్రపంచ టైటిల్స్ ను సాధించాడు. మొదట ఐబీఎన్ఎప్ ప్రపంచ 6-రెడ్ స్నూకర్ టైటిల్ గెలిచిన పంకజ్.. తర్వాత ప్రపంచ టీమ్ బిలియర్ట్స్ టైటిల్ ను సాధించాడు. ఈ నేపథ్యంలోనే అతడు మాట్లాడుతూ.. ‘‘గిల్ క్రిస్ట్ లాంటి ప్రమాదకరమైన ఆటగాడిపై ఫైనల్ లో విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది. అయినా నా పని సగమే పూర్తయ్యింది. ఇకనుంచి ప్రారంభమయ్యే టైమ్ ఫార్మాట్ పై దృష్టి సారిస్తాను’’ అంటూ పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pankaj advani  snooker games  world billiards championship  peter gilchrist  

Other Articles