Seema punia won gold medal in discuss throw game asian games 2014

seema punia latest news, seema punia news, seema punia gold medal, seema punia won gold medal asian games, seema punia discuss throw, seema punia gold medal, seema punia latest news, indian sports persons, asian games 2014, indian sports persons asian games 2014

seema punia won gold medal in discuss throw game asian games 2014

ఇండియాకు పండుతున్న పసిడి పంటలు!

Posted: 09/29/2014 06:53 PM IST
Seema punia won gold medal in discuss throw game asian games 2014

నిన్నమొన్నటివరకు నత్తనడకలా నడిచిన భారత్.. ఇప్పుడు వేగం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. అది కూడా ఒక మహిళ డిస్కస్ మే త్రో విభాగంలో అద్భుతంగా ప్రతిభను ప్రదర్శించి, గోల్డ్ మెడల్ ను సంపాదించుకుంది. ఒకవైపు పురుషులు, ఇతర సీనియర్ క్రీడాకారులు అనేక విభాగాల్లో పతాకాలు నెగ్గడంలో విఫలమవుతుంటే... మహిళల్లో మాత్రం జూనియర్ల నుంచి సీనియర్ల వరకు సరికొత్త రికార్డులు సృష్టించుకుంటూ భారత్ గౌరవాన్ని కాపాడుతున్నారు.

ఇదివరకే పురుషుల రెజ్లింగ్ విభాగంలో యోగేశ్వర్ దత్ 28 సంవత్సరాలను తిరగరాయగా.. తాజాగా మహిళల డిస్కస్ త్రో విభాగంలో భారత క్రీడాకారిణి సీమా పూనియా సంచలనమే సృష్టించింది. 61.03 మీటర్ల దూరం విసిరి, పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో మన భారత్ ఖాతాలో ఐదవ గోల్డ్ మెడల్ చేరిపోయింది. ప్రస్తుతం భారత్ కు దగ్గుతున్న పతకాల నేపథ్యంలో ఎక్కువ మెడల్స్ సాధించడంలో ఇండియాకు టాప్ టెన్ లో స్థానం దక్కించుకుంది. మరోవైపు చైనా దేశం 100కు గోల్డ్ మెడల్స్ సాధించి.. మొట్టమొదటి స్థానంలో దూసుకుపోతుంది.

ఇదిలావుండగా.. ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో భారత్ రెండు పతకాలను కైవసం చేసుకుంది. 61 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో బజరంగ్ రజత పతకాన్ని, 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ కాంస్య పతకాన్ని సాధించుకున్నారు. అలాగే 300 మీటర్ల స్టిపెల్ చేజ్ లో నవీన్ కుమార్ కాంస్యం దక్కించుకున్నాడు. ఇక మహిళల 1500 మీటర్ల రేసులో ఓపీ జైషా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుని తన సత్తా చాటుకుంది. ఇలాగే భారత్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనను కనబరిచి మరిన్ని స్వర్ణ, ఇతర పతకాలను గెల్చుకోవాలంటూ ఆశిద్దాం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles