Pakistan squash player maria wazir changed her getup as boy to participate in asian games 2014

maria wazir, pakistan player maria wazir, maria wazir news, maria wazir asian games, squash maria wazir, asian games 2014, maria wazir news, maria wazir weight lifting

pakistan squash player maria wazir changed her getup as boy to participate in asian games 2014

‘‘ఆట’’ కోసం అబ్బాయి అవతారమెత్తిన ముస్లిం మహిళ!

Posted: 09/24/2014 05:25 PM IST
Pakistan squash player maria wazir changed her getup as boy to participate in asian games 2014

(Image source from: pakistan squash player maria wazir changed her getup as boy to participate in asian games 2014)

సాధారణంగా ఆటలంటే ప్రతిఒక్కరికీ ఇష్టమే! కొంతమందైతే తమ జీవితం మొత్తాన్ని తమకిష్టమైన ఆటకోసమే అంకితం చేసేస్తారు. ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా అబ్బాయిలే ముందుంటారు. అయితే ఇక్కడో అమ్మాయి అందరికంటే భిన్నంగా తనకిష్టమైన ఆటకోసం పూర్తిగా అబ్బాయి అవతారమెత్తేసింది. ప్రపంచ మీడియాసైతం ఆమె వ్యవహారం గురించి తెలుసుకుని ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. అయితే తాను ఎందుకలా మారాల్సి వచ్చిందోనన్న విషయాన్ని తెలుసుకుని.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తేసింది.

ఆమె పేరు మరియా వజిర్... తాను వుండేది పాకిస్తాన్ లోని వజిరిస్తాన్ ప్రాంతంలో! మామూలుగానే పాకిస్తాన్ తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా వుండే ప్రాంతం. ఇక్కడ అమ్మాయిలు పరాయి మగాళ్లతో మాట్లాడటం కాదు కదా.. ఇంట్లో నుంచి అస్సలు బయటికే రాదు. ఒకవేళ వచ్చినా.. ఆ ఇంట్లోవాళ్లే ఘోరంగా శిక్షిస్తారు. ఇక పరాయి మగాళ్లతో మాట్లాడినట్లు తెలిస్తే.. నలుగురిలో మరణశిక్ష విధిస్తారు. అటువంటిది ఒక అమ్మాయి ఆటల గురించి ఆలోచించడం అంటే మాటలు కాదు. కానీ మరియాకి మాత్రం ఆటలంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రాణం. అయితే తాలిబన్ల చెర నుంచి తప్పించుకుని బయటపడి.. తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం ఆమెకు పెద్ద సవాలుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తాను ఒక పథకాన్ని రచించింది.

అబ్బాయిగా అవతారమెత్తితే తనను ఎవ్వరు గుర్తుపట్టలేరని భావించిన ఆ క్రీడాకారిణీ.. తన అన్నలాగే జుట్టు కత్తిరించుకుంది. ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పినప్పుడు వాళ్లు కూడా ఆమెకు అడ్డుపడలేదు. దీంతో ఆమె అబ్బాయిలా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టింది. తనకు నచ్చిన ఆటలాడుతూ.. అందులో మంచి ప్రతిభ సాధించింది. నేడు స్క్వాష్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆసియా క్రీడల స్క్వాష్ లో క్వార్టర్స్ కు చేరిన మరియా... ఈరోజు ఇంత స్థాయికి ఎదగడానికి తన తల్లిదండ్రుల ధైర్యమేనని వెల్లడిస్తోంది.

‘‘నేను మా అన్నలాగే బట్టలేసుకుంటానని, జుట్టు కత్తిరించుకుంటానని చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. మా నాన్న ధైర్యశాలి. నాకు మద్దతుగా నిలిచి.. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ముందు వెయిట్ లిఫ్టింగ్ లో ప్రతిభ చాటుకున్నా.. ఆ తర్వాత స్క్వాష్ కు మారాను’’ అని మరియా తెలిపింది. ఏదేమైనా.. మరియా చేసిన ఈ సాహసానికి, ఆమె కుటుంబసభ్యులకు ప్రతిఒక్కరు హ్యాట్సాఫ్ అంటూ చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maria wazir  asian games 2014  pakistan talibans  pakistan women  

Other Articles