India won first medal in asian games 2014

asian games, asian games schedule, asian games today schedule, asian games indian players, asian games finals, asian games live, asian games india medals, asian games medals, asian games latest, sports news, latest updates, events, latest news, swetha chaudary, swetha chaudary hot, swetha chaudary latest, swetha chaudary shooting, swetha chaudary wiki

indian shooter swetha chaudary won first medal for india in 10meters pistol shooting stream : asian games given india on its first day first medal by swetha chaudary in 10 meters shooting

ఆసియా గేమ్స్ లో బోణి కొట్టిన భారత్

Posted: 09/20/2014 09:43 AM IST
India won first medal in asian games 2014

ఆసియా క్రీడల్లో భారత్ బోణి కొట్టింది. గేమ్స్ ప్రారంభం అయిన తొలి రోజునే రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. అందులో ఒకటి స్వర్ణం అయితే.., మరొకటి కాంస్య పతకం. ఇవి రెండూ షూటింగ్ విభాగంలోనే రావటం విశేషం. మొదటగా స్వర్ణం పతకం సాధించినది జితురాయ్. పురుషుల యాబై మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జితు స్వర్ణం సాధించాడు. తనతో పోటిపడ్డ ప్రత్యర్దులందర్ని చిత్తు చేస్తూ... గురితప్పకుండా గోలి కొట్టి పతకం పట్టుకొచ్చాడు. ఇక షూటింగ్ విభాగంలోనే భారత వనితకు కాంస్య పతకం వచ్చింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేత చౌదరి కాంస్య పతకం గెలిచింది. ఈ విభాగంలో స్వర్ణ పతకం చైనాకు వచ్చింది.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం ప్రారంభం అయిన ఈ గేమ్స్ పదిరోజుల పాటు జరుగుతాయి. గతంతో పోలిస్తే భారత్ తరపున ఆటగాళ్లు., ముమ్మర కసరత్తు చేసి పోటిలకు వెళ్ళారు. ముఖ్యంగా చెప్పాలంటే షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విబాగాల్లో ఎక్కువ పతకాలు వస్తాయని ఆశిస్తున్నారు. వీటితో పటు టెన్నిస్, బ్యాడ్మింటన్ ప్లేయర్లు కూడా పతకాలను తెచ్చిపెడతారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు గ్లాస్సో గేమ్స్ మనకు మంచి ఫలితాలనే ఇస్తాయని కోచ్ లు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఇక శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన ఆసియా క్రీడలు పదిరోజుల పాటు జరుగుతాయి. వివిధ విభాగాల్లో మొత్తం 13వేల మంది ఆటగాళ్లు ఇక్కడ పోటీ పడుతున్నారు. వీరి కోసం 430 బంగారు పతకాలు సిద్దంగా ఉన్నాయి. 2010లో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత్ 14 పతకాలు పొందగా., ఈ సారి మరిన్ని ఎక్కువగా సాధించాలని పట్టుదలతో ఉంది. ఇక ఆసియా గే్మ్స్ ప్రారంభం సంబరాలు అదిరిపోయాయి. కళ్లు చెదిరే వెలుగుల్లో.., మిరుమిట్లు గొలిపే కాంతులతో అంగరంగవైభవంగా ప్రారంభ వేడుక జరిగింది.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asian games  swetha chaudary  sprots  latest news  

Other Articles