Thailand princess sirivannavari nariratana to take part in asian games in equestrian sports

thailand princes sirivannavari nariratana, sirivannavari nariratana photos, sirivannavari nariratana news, sirivannavari nariratana hot photos, sirivannavari nariratana equastrian sports, sirivannavari nariratana hot photos, sirivannavari nariratana asian games, asian games 2014

thailand princess sirivannavari nariratana to take part in asian games in equestrian sports

గుర్రాలతో పందేలు కాస్తున్న థాయ్ లాండ్ యువరాణి

Posted: 09/18/2014 02:17 PM IST
Thailand princess sirivannavari nariratana to take part in asian games in equestrian sports

(Image source from: thailand princess sirivannavari nariratana to take part in asian games in equestrian sports)

ఆమెపేరు సిరివన్నవారి నారిరతన... థాయ్ లాండ్ రాజవంశానికి చెందిన కింగ్ భుమిబోల్ కు మనవరాలు... అంటే ఆమె ప్రస్తుతం ఆ రాజ్యానికి యువరాణి... వయస్సు 27 సంవత్సరాలు... కావాలసినంత అందం వుంది... లెక్కలేనంత ఆస్తి బాగానే కూడగట్టుకుంది... అందంలోనూ, డబ్బులోనూ ఈమెకు సాటి ఎవ్వరూ లేరు. అయినప్పటికీ ఈమెకు ఏమైందో ఏమో.. గుర్రాలతో పందేలు కాస్తానంటూ ముందుకు వస్తోంది. తనకు గుర్రాలంటే ఎంతో ఇష్టమని పేర్కొన్న ఆమె.. ఇప్పుడు ఆ గుర్రాలతో కలిసి పోటీపడేందుకు తహతహలాడుతోంది. అయితే ఈమె పోటీపడుతోంది నేరుగా గుర్రాలతో కాదులెండి... ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ విభాగంలో అంటే గుర్రపు పందేలులో ఈ యువరాణి పోటీపడేందుకు సిద్ధమవుతోంది.

థాయ్ లాండ్ కు యువరాణి అయిన ఈ అందమైన అమ్మడికి క్రీడలంటే ఎంతో ఇష్టమని తెలుపుతోంది. ముఖ్యంగా గుర్రపు స్వారీలంటే ఎంతో ఇష్టమని పేర్కొంటోంది. ఎందుకంటే.. అందులో ఈ అమ్మడికి చిన్నపిటి నుంచి మంచి అనుభవం వుందని చెబుతోంది. గత మూడేళ్లనుంచి ఈ పోటీల్లో పాల్గొంటోంది కూడా! ఎవరి సిఫార్సు లేకుండా తన సొంత ప్రతిభతోనే ఈసారి ఈ అమ్మడు ఆసియా క్రీడల జట్టులతో స్థానం సంపాదించుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను స్వర్ణమే గెలుచుకోవాలన్న లక్ష్యాన్ని పదిలం చేసుకుని బరిలోకి దిగుతానని అంటోంది.

ఇలా ఈ యువరాణి ఆసియా క్రీడల్లో పాల్గొనడం మొదటిసారి కాదు.. ఇంతకుముందే 2006 దోహా క్రీడల్లో ఆమె బ్యాడ్మింటన్ విభాగంలో పోటీ పడింది. అప్పట్లో తోటి అథ్లెట్లతో కలిసి అథ్లెటిక్స్ విలేజ్ లో బస చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఈసారి ఆమె పాల్గొంటున్న గుర్రపు పందేల్లో తన ప్రతిభను చాటుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles