Badminton player gutta jwala wrath press meet

Gutta jwala latest news, gutta jwala latest press meet, gutta jwala movies, gutta jwala hot photo shoot, gutta jwala wrath press meet, badminton player gutta jwala news, gutta jwala angry

badminton player gutta jwala wrath press meet : the badminton player gutta jwala wrath press meet about the differences between singles and doubles players

నాలో ఏం తక్కువ.. నన్ను పట్టించుకోండి! జ్వాల

Posted: 08/04/2014 07:00 PM IST
Badminton player gutta jwala wrath press meet

(Image source from: badminton player gutta jwala wrath press meet)

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ‘‘నాలో ఏం తక్కువ... నన్నూ ఎవరైనా పట్టించుకోవచ్చుగా’’ అంటూ తన మనసులో వున్న భావాలను వ్యక్తపరిచింది. అయితే ఈమె తన అందం గురించి కానీ.. సినిమాల మీద దృష్టి సారించాలనే నేపథ్యంతో మాత్రం ఇలా చెప్పడం లేదు... బ్యాడ్మింటన్ క్రీడాంశంలో తనకు సరైన గౌరవం దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ... ఒక మీడియా సమావేశంలో ఇలా పేర్కొంది. బ్యాడ్మింటన్ క్రీడాంశంలో డబుల్స్ క్రీడాకారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని స్టార్ షట్లర్ అయిన గుత్తా జ్వాల ఆరోపణలు చేసింది.

‘‘మన భారతదేశంలో సింగిల్స్ క్రీడాకారులకు ఎంతో మంచి గుర్తింపు దక్కుతోంది. అందుకు వారికి కావాల్సిన ధనాన్ని కూడా ప్రభుత్వం కేటాయిస్తోంది. కానీ డబుల్స్ అంశానికి వస్తే మాత్రం.. నిధులతోపాటు ప్రోత్సాహం కూడా చాలా తగ్గిపోతోంది’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘ఇలాగైతే డబుల్స్ విభాగం పట్ల యువతలో ఆసక్తి పెంపొందించలేరని’’ ఆమె పేర్కొంటోంది. ఇందుకు ఆమె ఒక ఉదాహరణగా... ‘‘ఓ సింగిల్ షట్లర్ పది డాలర్లు సంపాదిస్తే... డబుల్స్ ప్లేయర్ కు మాత్రం కేవలం రెండు డాలర్లు మాత్రమే వస్తోంది’’ అని సవివరంగా విశ్లేషించి వివరించింది.

ఇలాగే.. ‘‘తాము ఎంతో అమోఘంగా ఆటను ప్రదర్శించి గెలుపొందినా.. తమకు ఎయిర్ పోర్టులో ఎవరూ స్వాగతం పలకడానికి రారని.... అదే ఓ మోస్టర్ ప్రదర్శనను కనబరిచిన సింగిల్స్ ప్లేయర్ కు మాత్రం ఎంతో అపూర్వంగా స్వాగతం పలుకుతారని’’ జ్వాల మండిపడుతూ స్పష్టం చేసింది. తాజాగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ డబుల్స్ లో జ్వాల, అశ్వినీ పొన్నప్ప జోడీ రజతంతో సరిపెట్టుకుంది. కానీ గత క్రీడల్లో మాత్రం స్వర్ణం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తనకు సరైన మర్యాద లభించలేదని ఆమె ఆవేదనను ఈ విధంగా వ్యక్తం చేసుకుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles