Portuguese and america teams end the match with tie

portuguese and america teams end the match with tie, 2014 fifa world cup, america and portuguese match, fifa world cup 2014, fifa world cup 2014 title, fifa world cup 2014 news, tie between america and portuguese, football player hyder

portuguese and america teams end the match with tie

ఓటమిటంచులకెళ్లి నాకౌట్ ఆశల్ని చిగుర్చుకున్న పోర్చుగల్

Posted: 06/23/2014 11:39 AM IST
Portuguese and america teams end the match with tie

(Image source from: portuguese and america teams end the match with tie)

ఫిఫా వరల్డ్ కప్ 2014లో రోజురోజుకో మలుపు తిరుగుతోంది. ఏ జట్టు తమ ప్రతిభను ప్రదర్శిస్తుందో అర్థంకాని రీతిలో పడిపోయారు అభిమానులు. భారీ అంచనాల మీద బరిలోకి దిగిన అగ్రజట్టులు ఇంటిదారి పడితే... బలహీనమైన జట్టులు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. ఈ తరహాలోనే కోస్టారికా వంటి బలహీనమైన జట్టు ఇటలీవంటి అగ్రటజట్టును ఓడించి, 24 సంవత్సరాల తరువాత ఒక కొత్త రికార్డు సృష్టించేసుకుంది.

ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లలో కూడా అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాకర్ ప్రపంచకప్ గ్రూప్ - జిలో అమెరికా, పోర్చుగల్ జట్టుల మధ్య మ్యాగ్ హోరాహోరీగా సాగింది. చివరి దశవరకు ఎవరు ఓటమి పాలవుతారు, ఎవరు గెలుస్తారన్న ఆందోళనలో ప్రతిఒక్కరు మునిగితేలారు. అయితే విచిత్రంగా 2-2 సమాన స్కోరుతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది.

ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన అమెరికా, పోర్చుగల్ జట్టులు.. ప్రతమార్థంలో భారీగా విజృంభించారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే పోర్చుగల్ టీం గోల్ చేసి ఆధిక్యంలో నిలిచింది. అయితే అమెరికా టీం వారు కూడా పోర్చుగల్ కు ధీటుగా... ఆట 5వ నిముషంలోనే గోల్ వేసి చెక్ పెట్టింది. దీంతో ఈ రెండు టీంల మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా కొనసాగింది.

ద్వితీయార్థంలో మొదలైన మ్యాచ్ లో అమెరికా జట్టువారు గొప్పగా తమ ప్రతిభను ప్రదర్శించారు. పోర్చుగల్ టీం వారికి గోల్స్ వేయనీయకుండా ఆటగాళ్లు బాగానే ఎదుర్కున్నారు. తరువాత కొద్ది సమయంలోనే అమెరికా జట్టు రెండో గోల్ ను సాధించి మొదటి స్థానంలోకి చేరిపోయింది. చివరి వరకు పోర్చుగల్ జట్టుకు గోల్ వేయనీయకుండా అమెరికా ఆటగాళ్లు బాగానే పోరాడారు. ఇక పోర్చుగల్ ఓటమి ఖాయమనుకున్న సమయంలో వరేలా, హెడర్ ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన ఆటను ప్రదర్శించి, అందరూ ఖంగుతినేలా చేశాడు. రెండోదశలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరస్పర సహాయంతో రెండో గోల్ ను సంపాదించారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరకు పోర్చుగల్ టీం నౌకాట్ కు వెళ్లే ఆశల్ని చిగుర్చుకుంది.

అయితే ఈ రెండు జట్టుల్లో ఏ జట్టు నాకౌట్ కు చేరిందన్న విషయం తెలియాలంటే.. 26వ తేదీన జరగనున్న అమెరికా - జర్మనీ, పోర్చుగల్ - ఘనా జట్టుల మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles