David Warner, Shaheen Afridi Involved in Fun-Filled Face-Off వార్నర్, అఫ్రిదీ మధ్య మూడో రోజున ఆసక్తికర సంఘటన

Pak vs aus 3rd test david warner shaheen afridi involved in fun filled face off on day 3

Australian opener, David Warner, Pakistan pacer, Shaheen Afridi, David Warner vs Shaheen Afridi, David Warner vs Shaheen Afridi Face Off, Pak vs Aus, PAK vs AUs 3rd Test, Pakistan vs Australia, warner afridi Funny face, warner afridi funny standoff, aus vs pak third test, face-off, stand-off, Australia, Pakistan, third test, third day, funny video, cricket australia, pakistan cricket board, cricket news, sports news, sports, cricket

David Warner and Shaheen Afridi were involved in a fun-filled face-off at the rner vs end of Day 3 of the 3rd Test between Pakistan and Australia. The two players stared at each other intensely on the final delivery before laughing. Australia ended Day 3 with a 134 run lead.

వార్నర్, అఫ్రిదీ మధ్య మూడో రోజున ఆసక్తికర సంఘటన

Posted: 03/24/2022 06:27 PM IST
Pak vs aus 3rd test david warner shaheen afridi involved in fun filled face off on day 3

చాలాఏళ్ల తరువాత పాకిస్థాన్ లో అస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇప్పటికే రెండు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచులు కూడా పూర్తయ్యాయి. ఈ రెండు టెస్టులలో కంగారులే పైచేయి సాధించారు. కాగా ప్రస్తుతం ఇరుజట్ల మధ్య లాహోర్ వేదికగా ముచ్చటగా మూడవ టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులోనూ అసీస్ ఆటగాళ్లు తమ అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మూడవ టెస్టు మూడవ రోజున ఇరు జట్ల కీలక ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మూడవ రోజు ఆట ముగిసే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మూడవ రోజులో ఆఖరి ఓవర్ ను షాహీన్ అప్రీది వేసాడు, అందులో ఓవర్ చివరి బంతిని ఆఫ్రిదీ వేయగా, దాన్ని అసీస్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ డిఫెండ్ చేశాడు. దానికి పరుగు తీసేలా వార్నర్ ముందుకు వచ్చాడు. అదే సమయంలో అఫ్రీది కూడా వార్నర్ పరుగును అడ్డుకునేలా అతడికి అత్యంత దగ్గరగా చేరుకున్నాడు. దీంతో తేల్చుకుందాం రా అన్నట్టుగా షాహీన్ వార్నర్ ను చూశాడు. దానికి వార్నర్ కూడా అంతే దీటుగా స్పందించాడు. ఎక్కడా తగ్గలేదు. అయితే ఇదంతా సరదాగానే జరగడం విశేషం. ఆ ఇద్దరూ వెంటనే నవ్వుకోవడం కెమెరాల్లో రికార్డయింది. ఈ సరదా ఇన్సిడెంట్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles