టీమిండియా జట్టు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఓ వైపు టెస్టు సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ ను క్లీస్ స్వీప్ అయ్యింది. దీంతో ఇంటా బయట విమర్శలతో కొలుకోలేని స్థితిలోకి జారుకున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వన్డే సిరీస్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా మూడవ వన్డేలో నువ్వా-నేనా అన్నట్లు తలపడినా.. ఉత్కంఠగా సాగిన ఈ వన్డేలోనూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రాణించి కేవలం 4 పరుగుల తేడాతో రాహుల్ సేన నుంచి విజయాన్ని లాక్కున్నారు. దీంతో కనీసం పరుపు నిలుపుకుందామనుకున్న మ్యాచ్ లోనూ ఓటమిపాలు కావడంతో వైట్‌వాష్ తప్పలేదు.
ఇక ఈ ఓటమి భారంతో నిరాశలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా రాహుల్ సేనకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పెట్టింది. ఐసీసీ నియావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం... నిర్దేశిత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ ఓవర్లు వేసిన కారణంగా ఈ మేరకు ఫైన్ విధించినట్లు పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికా పర్యటన టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. టెస్టు, వన్డే సిరీస్‌లో కలిపి మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడగా... టీమిండియా కేవలం ఒక్క టెస్టు మాత్రమే గెలవడం గమనార్హం. దీంతో హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు, రోహిత్ గైర్హాజరీలో తొలిసారి వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌కు భంగపాటు తప్పలేదు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more