VVS Laxman Declines BCCI's Offer for NCA Chief-Report వివీఎస్ బిసిసిఐ ఆఫర్.. నో చెప్పిన స్టైలిష్ బ్యాట్స్ మెన్

Vvs laxman refuses nca chief offer search for rahul dravid s replacement begins

National Cricket Academy, NCA, Rahul Dravid, VVS Laxman, NCA chief, head the NCA, Cricket, Team India, replace, replacement, coach, Cricket news, Sports news, cricket, sports

The Board of Control for Cricket in India (BCCI) had reportedly approached VVS Laxman to take over Rahul Dravid’s post as the chief of the National Cricket Academy (NCA). However, he has turned down the offer to head the NCA. The ace batsman has 8,781 runs to his name and is already the batting consultant of West Bengal in the domestic circuit at present.

వివీఎస్ బిసిసిఐ ఆఫర్.. నో చెప్పిన స్టైలిష్ బ్యాట్స్ మెన్

Posted: 10/18/2021 09:21 PM IST
Vvs laxman refuses nca chief offer search for rahul dravid s replacement begins

స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఆ ఆఫర్ ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా వెళ్లడం దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ నిర్వహిస్తున్న బాధ్యతలను ఇతర సీనియర్ క్రికెటర్లకు అప్పగించే పనిలో అన్వేషణ ప్రారంభించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. టీమిండియా మాజీ స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ పేరును ఎంపిక చేసింది. దీంతో ఆయనకు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా వ్యవహరించాలని కోరింది.

అయితే బిసిసిఐ కోరికను వీవీఎస్ సున్నితంగా తిరస్కరించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా బాధ్యతల నిర్వహణపై లక్ష్మణ్ వద్ద ప్రస్తావించగా... ఆయన నుంచి వ్యతిరేక సమాధానం రావడంతో బిసిసిఐ ఖంగుతినింది. ప్రస్తుతం బెంగాల్ జట్టుకు కన్సల్టెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఆ పదవిలోనే కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక దీంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ ఆయన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో బిసిసిఐ ఇచ్చిన నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ ఆపర్ కు ఇతరులను చూసుకోవాల్సిందిగా కోరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NCA  Rahul Dravid  VVS Laxman  NCA chief  BCCI  Team India  replace  cricket  sports  

Other Articles