టీమిండియాతో అహ్వాన జట్టు అస్ట్రేలియా ఆడిన తొలి వన్డేలో భారత బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ షాకయ్యాడు. అందుకు కారణం మాత్రం ఇద్దరు బ్యాట్స్ మెన్లు. ఒకరు అస్ట్రేలియా మిడిల్ ఆర్డన్ బ్యాట్స్ మెన్లు, ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కాగా, మరోకరు న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ జేమ్స్ నీషమ్. వీరిద్దరూ తాజాగా కనబర్చిన ఆటతీరుతో రాహుల్ ఒకింత నిశ్చేష్టుడయ్యాడు. ఇలా షాక్ లో వున్నా ఆయనకు మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న మాక్స్ వెల్ క్షమాపణలు చెప్పాడు. ఆంతేకాదు ఆయనతో పాటు మరో బ్యాట్స్ మెన్ జేమ్స్ నీషమ్ ఆటతీరుతో కూడా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఎందుకిలా అంటే అందుకు గల కారణాలు వేరే వున్నా.. ఇప్పుడు వారి ఆటతీరుతో అన్నీ తెరపైకి వచ్చాయి.
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ లో మాక్స్ వెల్, జేమ్స్ నీషమ్ లు పంజాబ్ తరఫున ఆడినా.. వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు, మాక్స్ వెల్ మొత్తంగా 13 మ్యాచులు ఆడినా కేవలం 108 పరుగులే స్కోర్ చేశాడు. టోర్నీ మొత్తంలో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, బెంగళూరు బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ సైతం ఆ టీ20లీగ్ లో ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కోహ్లీసేనతో ఆడిన మ్యాచులో ఈ ముగ్గురూ రెచ్చిపోయారు. ఫించ్(9 ఫోర్లు, 2 సిక్సర్లతో 114), స్టీవ్ స్మిత్( 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 105) శతకాలకు తోడు మాక్స్ వెల్ (5 ఫోర్లు, 3 సిక్సర్లతో 45) మెరుపు బ్యాటింగ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 374/6 భారీ స్కోర్ చేసింది.
ఇక శుక్రవారమే న్యూజిలాండ్.. వెస్టిండీస్ తో ఆడిన తొలి టీ20లో జేమ్స్ నీషమ్(ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 48) సైతం మెరుపు బ్యాటింగ్ చేశాడు. అతడు కూడా ఐపీఎల్ లో పంజాబ్ తరఫున పేలవ ప్రదర్శన చేశాడు. ఇప్పుడు ఒకేరోజు మాక్సీ, నీషమ్ దంచికొట్టడంతో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. వీళ్ల బ్యాటింగ్ చూశాక అతడెలా ఉంటాడనే దానిపై సరదాగా మీమ్స్ రూపొందించారు. ఈ క్రమంలోనే అలాంటి ఒక ట్వీట్ ను చూసిన జిమ్మీ దాన్ని షేర్ చేస్తూ మాక్స్ వెల్ ట్యాగ్ చేశాడు. అందులో రాహుల్ కోపంగా చూస్తున్నట్లు ఉంది. దానికి స్పందించిన మాక్సీ.. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్ల వెనుకనున్న రాహుల్ కు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు.
Hahaha that’s actually pretty good @Gmaxi_32https://t.co/vsDrPUx58M
— Jimmy Neesham (@JimmyNeesh) November 28, 2020
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more