Stephen Fleming comes out in support of MS Dhoni ఆరంభమే కదా.. ధోనిలో మ్యాచ్ ఫినిషర్ వచ్చేస్తాడులే.!

Stephen fleming chennai super kings still trying to find the right balance

Ipl 2020, stephen fleming ms dhoni, ms dhoni 3 sixes rr vs csk, ms dhoni form ipl 2020, faf du plessis opening csk, csk team ipl 2020 predictions, faf du plessis csk opening fleming, fleming ms dhoni csk ipl 2020, Chennai super Kings, stephen fleming, ms dhoni, Rajasthan Royals, faf du plessis, cricket, sports

Chennai Super Kings head coach Stephen Fleming said it will take a bit more time to see MS Dhoni at his best in Indian Premier League (IPL) 2020, considering the long break he has had from competitive cricket.

ఆరంభమే కదా.. ధోనిలో మ్యాచ్ ఫినిషర్ వచ్చేస్తాడులే.!

Posted: 09/25/2020 09:31 AM IST
Stephen fleming chennai super kings still trying to find the right balance

మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి మ్యాచ్ ఫినిషర్ గా మంచి పేరుంది. అలాంటి వ్యక్తి రాజస్థాన్‌ రాయల్స్ తో మ్యాచ్ లో ఎందుకు గెలిపించలేకపోయాడన్న ప్రశ్నలు తలెత్తుడంతో ఆయనకు మద్దతుగా నిలిచాడు చెన్నై సూపర్‌కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అంగా నిలిచాడు. అతడిలోని అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ బయటకు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అన్నారు. అయినా ఐపీఎల్ ఆరంభమయ్యింది ఇప్పుడే కదా.. కొంత రసపట్టుకు వచ్చేసమయానికి ముందే ధోని ఫినిషర్ గా మారడం ఖాయమని ప్లెమింగ్ చెప్పాడు. ప్రతీ ఏటా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయని పేర్కొన్నాడు.

రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ 14వ ఓవర్లో బ్యాటింగ్ దిగాడు. అయితే నిలదొక్కుకొని ఆడేందుకు కొద్దిగా సమయం తీసుకున్నాడు. మరోవైపునున్న డుప్లెసిస్ రాయల్స్ బౌలర్లను బెంబేలెత్తిస్తున్న సమయంలో ధోణి మాత్రం మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నించాడు. చాలాకాలంగా అతడు క్రికెట్‌ ఆడలేదు. అందుకే మహీలోని అత్యుత్తమ ఫినిషర్‌ బయటకొచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. మ్యాచ్‌ చివర్లో మాత్రం అతడు అద్భుతంగా ఆడాడు. డుప్లెసిస్‌ ఫామ్‌ కొనసాగించాడు. లక్ష్యానికి దాదాపుగా చేరుకున్నాం కాబట్టి బ్యాటింగ్‌ తీరుపై ఆందోళన లేదు’ అని ఫ్లెమింగ్‌ అన్నాడు.

అయితే ఇకపై ఆడనున్న మ్యాచులలో డుప్లెసిస్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని స్టీఫెన్ ప్లెమ్మింగ్ తెలిపారు. కాగా, మొదటి మ్యాచ్‌ తరహాలో షాట్లు బాది రన్ రేట్ ను తగ్గిస్తాడనే కరణ్‌ ను ముందు పంపించామని ఫ్లెమింగ్‌ చెప్పాడు. రుత్ రాజ్ కు ఇదే తొలిమ్యాచని, దూకుడు కొనసాగించాలని పంపామన్నాడు. తమ బౌలర్లు లెంగ్త్ ల విషయంలో పొరపాటు పడ్డారని పేర్కొన్నాడు. కాస్త ఫుల్‌ లెంగ్త్‌ బంతులు వేయడంతో రాజస్థాన్‌ ఆటగాళ్లు భారీ షాట్లు ఆడారని తెలిపాడు. రానున్న మ్యాచులలో తమ జట్టు బాగా రాణిస్తుందని ప్లెమ్మింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ipl 2020  Chennai super Kings  stephen fleming  ms dhoni  Rajasthan Royals  faf du plessis  cricket  sports  

Other Articles