Yuvraj Singh maafi maango trends on Twitter యువరాజ్ సింగ్ పై పోలీసు కేసు.. అరెస్టుకు అవకాశం..

Yuvraj singh maafi maango trends on twitter for making casteist remark on chahal

yuvraj singh maafi mango, yuvraj singh chahal, yuvraj chahal controversy, yuvraj singh casteist remark, yuvraj singh twitter trend, yuvraj chahal twitter, yuvraj comment on chahal, casteist remark, rohit sharma, instagram live, sports news, cricket news, sports, cricket

Former India cricketer Yuvraj Singh has landed in trouble after a video clip of him making a 'casteist' remark during his conversation with Rohit Sharma went viral. Yuvraj casually used a 'casteist' slur and that has now gone viral on social media with a lot users demanding an apology from the former India star.

యువరాజ్ సింగ్ పై పోలీసు కేసు.. అరెస్టుకు అవకాశం..

Posted: 06/05/2020 03:18 PM IST
Yuvraj singh maafi maango trends on twitter for making casteist remark on chahal

టీమీండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గత కొన్నాళ్లుగా యువీ టైం బాగోలేదనుకుంటా.. అయితే సమయం కలసిరాని సందర్భాల్లో సంయమనం పాటిస్తూ మౌనంగా వుండాలే తప్ప.. సరదా కోసం కూడా ఎవరినీ కించపర్చకూడదు. కానీ టీమిండియా డాషింగ్  ఓపెనర్ రోహిత్ శర్మతో చాట్ లో భాగంగా ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లలోనే వుంటున్న నెటిజనుల కామెంట్లతో దుమారాన్నే లేపుతున్నాయి.

అంతేకాదు కొందరు మరో అడుగు ముందుకేసి యువరాజ్ సింగ్ పై ఏకంగా పోలీసు కేసును నమోదు చేశారు. దళితులను కించపర్చేలా.. అవమానకరంగా ఓ పదం వినియోగించన ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. యువరాజ్ సింగ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి, అసలేం జరిగిందీ అంటే.. యువరాజ్ సింగ్.. రోహిత్ శర్మలు తమ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా చాహల్ టిక్ టాక్ అంశం చర్చకు వచ్చింది.

ఇళా మాట్లాడుతూ యువీ ‘భాంగి’ అని చాహల్ ను అన్నాడు. అది వివాదంగా మారింది. యువీ దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడని ట్రోలింగ్‌ జరిగింది. యువరాజ్‌పై హరియాణాలోని దళిత హక్కుల నేత, న్యాయవాది రజత్‌ కలశన్‌ హిస్సార్ లోని హన్సిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితులను కులం పేరుతో ప్రస్తావించడం వారిని అవమానించడమేనని.. దీంతో  దళితుల సెంటిమెంట్ గాయపడిందని పేర్కొన్నారు. ఈ చర్చకు సంబంధించిన సీడీలు, వివరాలను పోలీసులకు అందజేశానని ఆయన తెలిపారు. ఇక పోలీసులు కూడా యువీ తప్పు చేశాడని తెలిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles