Ben Stokes Says 'Never Said India Lost To England Deliberately' కావాలని టీమిండియా ఓడిపోలేదు.. భక్త్ మాటల గారఢి: బెన్ స్టోక్స్

Never said india lost deliberately to england at world cup ben stokes

Ben Stokes, Ben Stokes news, Sikander Bakht, MS Dhoni, Virat Kohli, Rohit Sharma, England, Ben Stokes cricket, England Cricket, England vs India, Ben Stokes book, India vs Pakistan, Pakistan World Cup, Cricket news, sports news, sports, cricket

England allrounder Ben Stokes denied the claims suggesting that he has hinted that India lost deliberately to England at the World Cup last year in his latest book. While addressing the encounter against India, Stokes wrote that 'there was little or no intent from Dhoni' in the match, and described the partnership between Rohit Sharma and Virat Kohli as 'mystifying'.

కావాలని టీమిండియా ఓడిపోలేదు.. భక్త్ మాటల గారఢి: బెన్ స్టోక్స్

Posted: 05/30/2020 01:58 PM IST
Never said india lost deliberately to england at world cup ben stokes

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో తమ చేతిలో టీమీండియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయిందని తాను అన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇంగ్లాండ్‌ ఆల్ రౌండర్‌ బెన్ స్టోక్స్‌ స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ జట్టు కావాలని ఓటమి పాలైందని తానెప్పుడు అన్నానని ఆయన ఎదురు ప్రశ్నించాడు. అయితే తాను చేసిన వ్యాఖ్యలను పదమార్పిడి చేయడం లేదా వాఖ్చాతుర్యంతో మాటలగారడి చేశారని అన్నారు. తానెప్పుడూ భారత్ పై అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తేల్చిచెప్పాడు. 2019 ప్రపంచకప్ లో తమతో జరిగిన మ్యాచులో కోహ్లీసేనలో కసి కనిపించలేదని మాత్రమే అన్నానని వెల్లడించాడు.

ఇంగ్లాండ్‌ క్రికెట్ జట్టుకు ప్రపంచకప్‌ అందించిన అల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ ‘ఆన్‌ ఫైర్‌’ అనే పుస్తకం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో వరల్డ్ కప్ లో విరాట్ సేన గురించి ప్రస్తావించిన ఆయన.. తమ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో ధోనీలో మ్యాచ్ గెలిపించే ఉద్దేశమే కనిపించలేదని స్టోక్స్‌ అన్నాడు. చివరి వరకు సింగిల్స్‌ తీయడం పైనే దృష్టిసారించాడని అన్నాడు. ఆఖరి రెండు ఓవర్లలో గెలిపించే అవకాశమున్నా భారీ షాట్లు ఆడలేదని పేర్కొన్నాడు. ఇక భారత సారథి విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మల భాగస్వామ్యం తనను విస్మయపర్చిందని వెల్లడించాడు.

వాస్తవంగా ఈ పోరులో టీమీండియా గెలిస్తే పాక్‌ సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలు ఉండేవని.. దీంతో తాము సెమీస్ కు వెళ్లకుండా భారత్ జట్టు ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లాండుతో జరిగిన మ్యాచులో ఓడిపోయిందని బెన్ స్టోక్స్‌ అన్నాడని పాక్‌ మాజీ క్రికెటర్‌ సికిందర్‌ భక్త్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి స్టోక్స్‌ ట్విటర్‌ ద్వారా సమాధానం చెప్పాడు. ‘నేనలా అన్నానని మీరు నిరూపించలేరు. ఎందుకంటే నేనెప్పుడూ అలా అనలేదు. దీనినే పదాల గారడి లేదా మాటల మార్పిడి అంటారు’ అని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles