ICC Rankings: India lose No. 1 Test spot ఐసీసీ టెస్టు ర్యాంకింగ్: నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన టీమిండియా

Australia dethrone india to take top spots in icc test and t20i rankings

international cricket council, australia, india, england, south africa, cricket, new zealand, COVID-19, ICC test Ranking, India lose top rank, australia on top rank, cricket news, sports news, cricket, sports

Australia became the top-ranked team in ICC's recently released Test and T20I rankings for men. The Australian team dethroned India to take the top spot in Test ranking with 116 points. India was the number one side in Test cricket since October 2016 but has now slipped to the third spot with 114 points. In ICC's T20 International Rankings,

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్: నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన టీమిండియా

Posted: 05/01/2020 08:29 PM IST
Australia dethrone india to take top spots in icc test and t20i rankings

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సి ర్యాంకింగ్ విధానంలో తీసుకువచ్చిన మార్పులతో టీమిండియా టెస్టు ర్యాంకింగ్ లలో తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానాన్ని కైవసం చసుకుంది. కాగా అసీస్ తరువాత అధ్యధిక పాయింట్లతో రెండో స్థానాన్ని న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. కివీస్ తరువాత మూడవ స్థానాన్ని భారత్ అక్రమించింది, దీంతో గత మూడున్నరేళ్లుగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్న టీమిండియా.. తాజాగా తొలి స్థానం నుంచి మూడో స్థానానికి  పడిపోయింది.

తాజా ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 116, న్యూజిలాండ్ 115, ఇండియా 114 పాయింట్లతో ఒకదానికికొకటి పోటీగా వున్నా.. ఈ మూడు దేశాల మధ్య కేవలం ఒక్కోక్క పాయింట్ మాత్రమే వత్యాసంగా వున్నా.. అధిక పాయింట్లతో అసీస్ జట్టు అగ్రబాగన కొనసాగుతోంది. 2016 నుంచి టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2016-17లో భారత్ 12 టెస్టులు గెలుపొంది, ఒక టెస్టును కోల్పోయింది. అయితే ఆ రికార్డులను తొలగిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది.

తాజా ర్యాంకింగ్స్ కోసం 2019 మే నుంచి ఆడిన మ్యాచులు 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచులకు సంబంధించి 50 శాతం రేటింగ్ పాయింట్లను ఆధారంగా తీసుకున్నారు. దీంతో, భారత్ అగ్ర స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. కరోనా కారణంగా మ్యాచులు జరగకపోవడం కూడా భారత్ కు ప్రతికూలంగా మారింది. ఇక ఇదే ప్రాతిపదికన తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్ లలోనూ టీమిండియా మూడో స్థానానికే పరిమితమైంది. ఆసీస్ తొలి స్థానంలో ఉంది. వన్డేల్లో ఇంగ్లాండ్ తొలి స్థానంలో ఉండగా... భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia  india  england  south africa  cricket  new zealand  COVID-19  ICC test Ranking  Cricket  sports  

Other Articles