MS Dhoni clarified BCCI Selectors ధోని రిటైర్మెంటుపై బిసిసిఐ సెలక్టర్లకు స్పష్టత

Ms dhoni clarified is no longer in india s scheme of things

world cup, MS Dhoni, Retirement, BCCI, Team India, MS Dhoni, Sanjay Jadgale, M S K Prasad, Dhoni retirement plan, BCCi, Test cricket, veteran wicket-keeper, Indian wicket-keeper, wicket-keeper, MSD, Dhoni, sports, cricket

MS Dhoni has been clarified that he isn't going to be part of India's scheme of things however has ruled out retiring for now keeping World T20 in mind.

ధోని రిటైర్మెంటుపై బిసిసిఐ సెలక్టర్లకు స్పష్టత

Posted: 07/22/2019 04:53 PM IST
Ms dhoni clarified is no longer in india s scheme of things

టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ కెరీర్ చరమాంకంలో ఉన్నదన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఈ చర్చ మాజీ కెప్టెన్ అభిమానులను ఒకింత అందోళనకు గురిచేస్తోంది కూడా. అయితే క్రికెట్ పండితులు మాత్రం వరల్డ్ కప్ ముగిసిన అనంతరం ధోనీ రిటైర్మెంటు ప్రకటిస్తారని అప్పట్లో సంకేతాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రపంచకప్ ముగిసిన తరువాత కూడా ఆ ఊసే ఎత్తడం లేదంటూ చర్చలకు తావిస్తున్నారు.

ఇక దీనికి తోడు పారాచూట్ రెజిమెంట్ లో పనిచేసేందుకు రెండు నెలల ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో, వెస్టిండీస్ టూర్ కు ధోనీని టీమిండియా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ధోనీతో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, సమర్థుడైన వికెట్ కీపర్ ను ఇప్పటినుంచే తయారు చేసుకునేందుకు వీలుగా ధోనీతో ఎమ్మెస్కే చర్చలు జరపారు.

కాగా, తానిప్పుడు రిటైర్ కావడంలేదని, అదే సమయంలో టీమిండియా భవిష్యత్ ప్రణాళికల్లో కూడా భాగం కాదలచుకోలేదని ధోనీ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక తనను మేజర్ టోర్నమెంట్లకు పరిగణనలోకి తీసుకోనవసరంలేదని ధోనీనే పరోక్షంగా చెప్పడంతో కుర్రాళ్లను ఎంకరేజ్ చేయాలని భారత సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే రిషబ్ పంత్ ను మూడు ఫార్మాట్లలో ప్రధాన వికెట్ కీపర్ గా విండీస్ పర్యటనకు ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world cup  MS Dhoni  Retirement  Sanjay Jagdale  BCCI  Team India  sports  cricket  

Other Articles