India seeks Ravi Shastri's replacement after World Cup shock టీమిండియా ప్రధానకోచ్ కు బిసిసిఐ గట్టి షాక్..!

India seeks ravi shastri s replacement after world cup shock

teamindia, ravi shastri, replacement, Bcci, Head coach, world cup, shock to indian coach, New coach to TeamIndia, cricket, sports

The BCCI has invited fresh applications for the head coach and support staff of the India men's cricket team after shock World Cup exit.

టీమిండియా ప్రధానకోచ్ కు బిసిసిఐ గట్టి షాక్..!

Posted: 07/16/2019 08:19 PM IST
India seeks ravi shastri s replacement after world cup shock

భారత క్రికెట్ జట్టుకు త్వరలో ప్రధాన కోచ్‌ మారనున్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి కోచ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోచ్ తో పాటు సహాయ సిబ్బంది నియామకం కోసం త్వరలోనే బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేయనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌ కు భారత క్రికెట్ జట్టు పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ తో రవిశాస్త్రి పదవీకాలం ముగిసినా, వెస్టిండీస్ తో టూర్ నేపథ్యంలో కాంట్రాక్ట్ ను 45 రోజుల పాటు పొడిగించారు.

ఇక వరల్డ్ కప్ లో సెమీస్ లోనే భారత్ నిష్క్రమించిన నేపథ్యంలో, రవిశాస్త్రికి మరో అవకాశంగానీ, మరోమారు పదవీకాలం పొడిగింపుగానీ ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. రవిశాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ లతో పాటు, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ ల స్థానంలోనూ కొత్తవారు రానున్నారు.

వరల్డ్‌ కప్‌ వైఫల్యం తరువాత జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్‌, ట్రైనర్‌ శంకర్‌ బసులు ఇప్పటికే తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వెస్టిండీస్ పర్యటన తరువాత, సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే పోటీల సమయానికి కొత్త కోచ్, అతని సహాయకుల ఎంపిక పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teamindia  ravi shastri  BCCI  Head Coach  world cup  cricket  sports  

Other Articles

 • Virat kohli ticks off kesrick williams to unleash his inner pant

  విలియమ్స్ పై విరాట్ కోహ్లీ బదులు తీర్చుకున్నాడోచ్..!

  Dec 07 | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్ ను ఉద్దేశించి... Read more

 • Bumrah a baby kohli not same class as sachin pakistan s abdul razzaq mocks

  బుమ్రా తరువాత విరాట్ కోహ్లీపై రజాక్ విసుర్లు..

  Dec 05 | పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ టీమిండియా క్రికెటర్లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. టీమిండియా పేస్ దిగ్గజం జస్ప్రిత్ బుమ్రా తరువాత ఆయన ఏకంగా భారత్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీని టార్గెట్ చేస్తూ... Read more

 • Bob willis dies viv richards leads tributes to legendary england fast bowler

  క్రికెట్ లెజండ్ బాబ్ విల్స్ కన్నుమూత..

  Dec 05 | ఇంగ్లండ్ క్రికెట్ లెజండ్ బాబ్ విల్లిస్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విల్లీస్, మరణవార్తను ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... Read more

 • Don t speculate on ms dhoni wait till the ipl ravi shastri

  ధోనిపై అప్పుడే ఊహాగానాలు వదన్న కోచ్.!

  Nov 26 | టీమిండియాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించక నెలలు గడుస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టకు దూరమైన ధోని.. ఆ తరువాత రెండు నెలల పాటు భారత ఆర్మీతో కలసి... Read more

 • I was a friend of warne so australia didn t sledge me anil kumble

  అసీస్ నన్నెప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదు: అనీల్ కుంబ్లే

  Nov 26 | ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టులోని బౌలర్లు, బ్యాట్స్ మెన్లకు స్లెడ్జింగ్‌ పిచ్చ పీక్స్ లోకి తీసుకెళ్తుంది.. అంతేకాదు.. వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. ఇది సహజంగా ఆదేశ పర్యటనకు వెళ్లే ప్రతీ ఆటగాడు చెసే పిర్యాదు.... Read more

Today on Telugu Wishesh