Complaint against Tendulkar dismissed సచిన్ టెండుల్కర్ అభిమానుల సంబరం..

Conflict of interest complaint against sachin tendulkar dismissed

V. V. S. Laxman,sourav ganguly,sachin tendulkar,Rahul Johri,Mumbai Indians,Board of Control for Cricket in India, DK Jain, Conflict of Interest, Supreme court, chasing rate, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Supreme Court appointed ombudsman and ethics officer, DK Jain, has arrived at the conclusion that the complaint against Tendulkar regarding conflict should be disposed of.

సచిన్ పై పిర్యాదు కొట్టివేత.. అభిమానుల సంబరం..

Posted: 05/28/2019 10:24 PM IST
Conflict of interest complaint against sachin tendulkar dismissed

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై దాఖలైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల పిర్యాదును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎథిక్స్‌ ఆఫీసర్ జస్టిస్‌ డీకే జైన్‌ కొట్టేశారు. బిసిసిఐలో క్రికెట్‌ సలహా కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలోనే.. అటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌ కు ఐకాన్ గా వ్యవహరిస్తున్నాడంటూ ఆయనపై ఓ మాజీ క్రికెటర్ పిర్యాదు చేశాడు. సచిన్ టెండుల్కర్ తో పాటు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లపై కూడా ఈ పిర్యాదులు అందాయి.

ఈ క్రమంలో ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కిందకే వస్తుందంటూ బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి జస్టిస్‌ జైన్.. సచిన్‌కు నోటీసులు పంపారు. నిర్ధిష్ట సమయంలోపు తమ సమాధానాలు చెప్పాలని కూడా నోటీసులలో అదేశించారు. ఒక్కసారి అవకాశాన్ని కోల్పేతే మరో పర్యాయం ఈ విషయమై ఎలాంటి వివరణలను వినబోమని కూడా జస్టిస్ జైన్ పేర్కోన్నారు. దీనిపై పూర్తిగా విచారించిన బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి జస్టిస్‌ డీకే జైన్‌... సచిన్‌ పదవి విరుద్ధ ప్రయోజన అంశం కిందకు రాదంటూ తేల్చి చెప్పేశారు.

ఈ మేరకు తీర్పు వెలువడడంతో సచిన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తనకు వచ్చిన నోటీసులపై సచిన్ ఘాటుగా స్పందించాడు. 'సీఏసీలో సభ్యుడిగా ఉంటూ.. ముంబై ఇండియన్స్‌ ఐకాన్‌గా కొనసాగితే వచ్చే సమస్య ఏంటని ప్రశ్నించాడు. 2013లోనే ముంబై ఇండియన్స్‌ ఐకాన్ గా ఎంపికైన విషయం తెలిసే 2015లో బీసీసీఐ సీఏసీలో సభ్యుడిగా ఎంపిక చేసుకుందని వెల్లడించాడు. ఇంకా కావాలంటే బీసీసీఐ నుంచే వివరణ కోరండి' అంటూ వివరించాడు. మొత్తం 13 పాయింట్లతో సచిన్‌ వివరణ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  DK Jain  Conflict of Interest  Rahul Johri  Mumbai Indians  BCCI  sports  cricket  

Other Articles