ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రితం రోజు రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠకర పోరులో చివరి బంతి వరకు గెలుపు ఇరు జట్లను ఉవ్విళూరించినా.. చివరకు చెన్నైనే వరించింది. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై జట్టు తన ఖాతాలో మరో ఘనతను వేసుకుంది. అంతేకాదు ఈ జట్టుకు సారధిగా వ్యవహరిస్తోన్న ఆ జట్టు కెప్టెన్ ధోనీ ఖాతాలోనూ అరుదైన రికార్డు వచ్చి చేరింది.
రాజస్థాన్‌పై విజయం సాధించిన చెన్నై వంద మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో మొత్తం 12 సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 166 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సరిగ్గా శతవిజయ ఘనతను సాధించింది. అంతేకాదు, ఐపీఎల్లో వంద మ్యాచులు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more