India stroll to series-levelling win రెండో టీ20లో టీమిండియా విజయం..

India vs new zealand 2nd t20i highlights india beat new zealand by 7 wickets

India vs New Zealand, india national cricket team, ind vs nz t20, Ind vs Nz score, Ind vs NZ, Australia national cricket team, ODI Series, India vs New Zealand, T20 Series, Team India, Rohit Sharma, MS Dhoni, Krunal Pandya, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India took control of the match in the first 10 overs of the New Zealand innings. After that, apart from a period in which Coln de Grandhomme went ballistic, the visitors never really ceded their ground.

రెండో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్ 1-1తో సమం..

Posted: 02/08/2019 06:39 PM IST
India vs new zealand 2nd t20i highlights india beat new zealand by 7 wickets

తొలి టీ20లో అత్యధిక పరుగుల తేడాతో పరాజయం పాలైన రోహిత్ సేన తాజాగా ఇవాళ జరిగిన రెండో టీ20లో కివీస్ పై ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సొంతం చేసుకుంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచులో 159 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఇంకా ఏడు బంతులు మిగిలి ఉంగానే లక్ష్యాన్ని చేరుకుంది. టీమ్ విజయంలో రోహిత్, కృనాల్ కీలకపాత్ర పోషించారు.

లక్ష్య ఛేదనలో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్(50), శిఖర్(30), విజయ్ శంకర్(14) వికెట్లు కోల్పోయినా.. రిషబ్ పంత్(40 నాటౌట్), ధోనీ(20 నాటౌట్) మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో సమమయ్యింది. ఇక సిరీస్ ను తేల్చే మూడవది.. ఆఖరు టీ20ని గెలుచుకునేందుకు ఇరు జట్టు సిద్దంకానున్నాయి. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్, సోధి, మిచెల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 158 ప‌రుగులు చేసింది. తొలి టీ-20 మ్యాచులో భార‌త బౌలింగ్ ను ఊచ‌కోత కోసిన ప్ర‌మాద‌క‌ర బ్యాట్స్‌మెన్ సీఫెర్ట్ (12) ఆరంభంలోనే భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్లో కీప‌ర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ప‌దిహేను ప‌రుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం కృనాల్ పాండ్యా కివీస్ ను క‌ష్టాల్లోకి నెట్టేశాడు.
 
ఓపెన‌ర్ మున్రో (12), మిచెల్ (1), కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ (20) కృనాల్ ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిల‌వ‌లేక‌పోయారు. ఈ ద‌శ‌లో గ్రాండ్‌హోమ్ (50), రాస్ టేల‌ర్ (42) కివీస్‌ను ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 77 ప‌రుగులు జోడించారు. వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును ఉర‌క‌లెత్తిస్తున్న ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడ‌దీశాడు. పాండ్యా బౌలింగ్‌లో రోహ‌త్‌కు క్యాచ్ ఇచ్చి గ్రాండ్‌హోమ్ వెనుదిరిగాడు. కొద్దిసేప‌టికే టేల‌ర్ ర‌నౌట్ అయ్యాడు. అనంత‌రం వ‌చ్చిన బ్యాట్స్‌మన్ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోవ‌డంతో న్యూజిలాండ్ 20 ఓవ‌ర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో కృనాల్‌కు 3, ఖ‌లీల్‌కు 2 వికెట్లు ద‌క్కాయి. భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడ‌గొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  T20 Series  Team India  Rohit Sharma  MS Dhoni  Krunal Pandya  sports  cricket  

Other Articles