Virat Kohli fantastic to play under: Starc విరాట్ కోహ్లీపై అసీస్ బౌలర్ ప్రశంసలు

Virat kohli is a fantastic captain mitchell starc

virat kohli, Mitchell Starc, India vs Australia 3rd Test, India vs Australia, Ind vs Aus 3rd test, australia fast bowler, mitchell starc, sports, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Australian pace spearhead Mitchell Starc has described Virat Kohli as a "fantastic captain", having shared the dressing room with the India captain while representing Royal Challengers Bangalore in the IPL.

విరాట్ కోహ్లీపై అసీస్ బౌలర్ ప్రశంసలు

Posted: 12/24/2018 04:58 PM IST
Virat kohli is a fantastic captain mitchell starc

భారత స్టార్ బ్యాట్స్ మెన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సారధని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కితాబిచ్చాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో గత వారం ముగిసిన రెండో టెస్టు మ్యాచులో పేస్, బౌన్స్ కి అతిగా అనుకూలించిన పిచ్ పై వీరోచిత శతకం బాదిన విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ వరుసగా కవ్విస్తూ బౌన్సర్లతో పరీక్షించినా కోహ్లీ సహనంతో క్రీజులో నిలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

అయితే.. రెండో టెస్టులో భారత్ జట్టు ఓడటంతో.. నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమవగా.. మూడో టెస్టు మ్యాచ్‌ బుధవారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మిచెల్‌ స్టార్క్ మాట్లాడాడు. ‘విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన కెప్టెన్. టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు అంచనాలకి తగ్గట్టుగానే ఆడుతోంది. ఇక విరాట్ కోహ్లీతో కలిసి నేను రెండు ఐపీఎల్ సీజన్లు ఆడాను. అతని కెప్టెన్సీ ఆడటంతో ఓ మంచి అనుభూతి’ అని మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు.

2014 ఐపీఎల్‌ సీజన్‌‌లో మిచెల్ స్టార్క్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతను కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి మారాడు. కానీ.. గాయం కారణంగా.. గత ఏడాది ఐపీఎల్‌కి దూరమైన ఈ ఫాస్ట్ బౌలర్.. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ కోసం 2019 ఐపీఎల్ సీజన్‌కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. అతను వేలంలోకి రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles