BCCI recommends Dravid, Kohli, Gavaskar for honour గవాస్కర్ కు ద్యాన్ చంద్ అవార్డు సిఫార్సు..

Bcci recommends dravid for dronacharya kohli for khel ratna gavaskar for dhyan chand

BCCI, Virat Kohli, Sunil Gvaskar, Dhyan Chand Lifetime Achievement Award, Rahul Dravid, Dronacharya award, Rajiv Gandhi Khel Ratna, cricket news, sports news, sports, cricket

The BCCI has recommended former India captain Rahul Dravid for the prestigious Dronacharya award and has once again nominated Virat Kohli for the Rajiv Gandhi Khel Ratna honour.

ద్రావిడ్ కు ద్రోణాచార్య, కోహ్లీకి ఖేల్ రత్నకు సిఫార్సు..!

Posted: 04/26/2018 05:23 PM IST
Bcci recommends dravid for dronacharya kohli for khel ratna gavaskar for dhyan chand

బిసిసిఐ తమ క్రికెటర్లకు, టీమిండియా పేరును మరోమారు విశ్వవ్యాప్తం చేసేలా దోహదపడిన మాజీలకు, అనునిత్యం క్రికెట్ ప్రపంచమే తన ప్రపంచమని భావించే మెన్నటితరం క్రికెట్ పెద్దలకు పలు అవార్డులను అందించి సత్కరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్  విరాట్‌ కోహ్లీతో పాటు టీమిండియా అండర్-19 జట్టు ప్రపంచకప్ ను సాధించడంలో దోహదపడిన రాహుల్ ద్రావిడ్ కు పలు అవార్డులను ఇవ్వాలని సిఫార్సు చేసింది.

ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డును పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి ఇవ్వాలని సిఫారసు చేసిన.. భారత క్రికెట్ నియంత్రణ మండలి.. భారత అండర్‌-19 క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ క్రికెటర్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ పేరును ద్రోణాచార్య, మరో మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్ కు ధ్యాన్ చంద్ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఓ లేఖను పంపినట్లు బీసీసీఐ సీవోఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ధ్రువీకరించారు.

‘ఖేల్‌రత్న కోసం బీసీసీఐ కోహ్లీ పేరు పంపడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఈ అవార్డు కోసం కోహ్లీ పేరు తాము సిఫారసు చేయగా,  రియో ఒలింపిక్‌ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్‌, తృటిలో పతకం కోల్పోయిన దీప కర్మాకర్ లకు దీనిని అందించారని.. దాంతో ఈ ఏడాది మరోమారు విరాట్ కోహ్లీ పేరును పంపించామని రాయ్‌ వివరించారు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తోన్న కోహ్లీ ఈ మూడు ఫార్మాట్లలోనూ స్థిరంగా రాణిస్తున్నాడు. అంతేకాదు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ చిరస్మరణీయమైన విజయాలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ మరికొన్ని రికార్డులకు చేరువయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles