australia creates world record in t20s ప్రపంచ రికార్డును నెలకొల్పిన అసీస్

Trans tasman trophy 5th t20i australia creates world record in t20s

Trans-Tasman Trophy, Cricket, Top 5 / Top 10, Australian Cricket, New Zealand Cricket, David Warner, Martin Guptill, slider, Tri Series in Australia and New Zealand, 2018 Eden Park, third-slowest scoring ground, T20 venue, cricket

Australia pulled-off the highest-ever run chase in T20I in history to beat New Zealand by 5 wickets at the Eden Park in Auckland

ప్రపంచ రికార్డును నెలకొల్పిన అసీస్

Posted: 02/16/2018 06:15 PM IST
Trans tasman trophy 5th t20i australia creates world record in t20s

న్యూజిలాండ్ తో ఆక్లాండ్ వేదికగా జరిగిన ట్రాస్ టస్ మ్యాన్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మక్కోణపు సిరీస్ అస్ట్రేలియా ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకుంది. ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు సృష్టించింది. అత్యధిక పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.

నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులు చేసి అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌కే చెందిన బ్రెండన్ మెకల్లమ పేరిట ఉన్న వేగవంతమైన సెంచరీ రికార్డును బద్దలుగొట్టాడు. మరో ఓపెనర్ కోలిన్ మన్రో 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. వీరిద్దరి దెబ్బకు కివీస్ 243 పరుగులు చేసింది.
 
అనంతరం 244 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 7 బంతులు ఉండగానే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేయగా, ఆర్కీ షార్ట్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. వీరిద్దరు రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా అలవోకగా విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో ఆసీస్ ఖాతాలో సరికొత్త రికార్డు వచ్చి చేరింది. అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. 2015లో విండీస్ జట్టు దక్షిణాఫ్రికా విధించిన 232 పరుగుల విజయ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్ కాగా, ఇప్పుడా రికార్డును ఆస్ట్రేలియా అధిగమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trans-Tasman Trophy  australia  newzealand  england  T20  cricket  

Other Articles