enthusiastic about doing commentary: Ganguly టీమిండియా మాజీ కెప్టెన్ కు అరుదైన గౌరవం

Icc u19 cwc best platform to watch upcoming talent

ICC U19 Cricket World Cup 2018, commentary, enthusiastic, best platform, single platform, upcoming talent, Sourav Ganguly, Tom Moody, Ian Bishop, Test cricket, Shikhar Dhawan, Ashwin, Bhuvneshwar Kumar, sports news, sports, cricket news, cricket

commentary at the ICC U19 Cricket World Cup, will give me a chance to see the best upcoming talent from around the world on a single platform says former India skipper Sourav Ganguly.

టీమిండియా మాజీ కెప్టెన్ కు అరుదైన గౌరవం

Posted: 01/11/2018 03:30 PM IST
Icc u19 cwc best platform to watch upcoming talent

భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి అరుదైన అవకాశం దక్కింది. అండర్-19 ప్రపంచకప్ పోటీలలో ఆయన కామెంటేటర్ గా ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా అండర్‌-19 ప్రపంచకప్ టార్నోమెంటు జరగనుంది. ఈ టోర్నీకి కామెంటేటర్‌ బాధ్యతలు నిర్వహించే వారి జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. 14మందితో కూడిన జాబితాలో భారత్ కు చెందిన మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, అంజుమ్‌ చోప్రా చోటు దక్కించుకున్నారు.

ఇప్పటికే కామెంటేర్లుగా బాద్యతులు నిర్వహిస్తున్న గంగూలీ, అంజుమ్‌ చోప్రాలతో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ ఫిబ్రవరి 3తో ముగియనుంది. పృథ్వీ షా నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కాగా ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ టార్నమెంటులో కామెంటేటర్ గా ఎంపికైన సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. తాను ఈ ఈవెంట్ లో పాల్గోంటున్నందుకు చాలా సంతోషంగా వుందని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా రాబోతున్న భవిష్యత్ టాలెంట్ ను దగ్గర్నుంచి చేసేందుకు తనకు ఈ ఎంపిక దోహదపడుతుందన్నాడు. ఈ ఈవెంట్ లో అన్ని దేశాలకు చెందిన అప్ కమింగ్ టాలెంట్ ను వీక్షించే ఏకైక వేదికగా కొనియాడారు.

కామెంటరీ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న వారు:

* సౌరభ్‌ గంగూలీ(ఇండియా)
*  అంజుమ్‌ చోప్రా(ఇండియా)
* టామ్‌ మూడీ (ఆస్ట్రేలియా)
* ఇయాన్‌ బిషప్‌(వెస్టిండీస్‌)
* సైమన్‌ డౌల్‌(న్యూజిలాండ్‌)
* డానీ మారిసన్‌(న్యూజిలాండ్‌)
*హెచ్‌డీ అకర్మన్‌(దక్షిణాఫ్రికా)
*రాబ్‌ కీ(ఇంగ్లాండ్‌)
* నిక్‌ నైట్‌(ఇంగ్లాండ్‌)
* మార్క్‌ బుచర్‌(ఇంగ్లాండ్‌)
* గ్రాంట్‌ ఇలియాట్‌(న్యూజిలాండ్‌)
* క్రిస్‌ హారిస్‌(న్యూజిలాండ్‌)
* రసూల్‌ ఆర్నాల్డ్‌(శ్రీలంక)
* అలాన్‌ విలకిన్స్‌(ఇంగ్లాండ్‌)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC U19 Cricket World Cup  commentary  Sourav Ganguly  upcoming talent  cricket  

Other Articles