Pujara wages lone battle as India wobble vs Sri Lanka వరుణుడు కరుణించక.. వాతావరణం అనూకూలించక..

India vs sri lanka 1st test rain washes out 2nd day india 74 5

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, eden gardens, kolkata, Sri Lanka, Cheteshwar Pujara, Virat Kohli, Tom Latham, Ross Taylor, Kane Williamson, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Trent Boult, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

India resume Day 2 at a shaky 17/3 after Suranga Lakmal rocked India in the 11.5 overs possible on a rain-hit opening day of the first Test at the Eden Gardens in Kolkata.

వరుణుడు కరుణించక.. వాతావరణం అనూకూలించక..

Posted: 11/17/2017 05:52 PM IST
India vs sri lanka 1st test rain washes out 2nd day india 74 5

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు రెండో రోజు కూడా ప్రకృతి అనుకూలించలేదు. తొలి రోజుల బ్యాడ్ లైట్ తో వికెట్లు కోల్పోయిన టీమిండియా.. రెండో రోజున కూడా అదే ఒరవడిని కొనసాగించారు. ఛట్టేశ్వర్ పూజారా మినహా టీమిండియాలో ఎవరు కనీసం రాణించకలేకపోయారు. తొలి రోజున చేసిన మూడు వికెట్ల నష్టానికి 17 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీమిండియా, రెండో రోజున అట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.

తొలి రోజు 11.5 ఓవర్లకు అడిన జట్లు.. ఇవాల రెండో రోజున 20.1 ఓవర్లకు ఆటను పరిమితం చేశాడు. ఇవాళ టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానె (4; 21 బంతుల్లో 1×4) జట్టు స్కోరు 30 వద్ద పెవిలియన్‌ చేరాడు. శనక వేసిన 17.2వ బంతికి పేలవ షాట్‌ ఆడి డిక్వెలా చేతికి చిక్కాడు. అ తరువాత రవిచంద్రన్‌ అశ్విన్‌ (4) సైతం శనక బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు 50 పరుగులకు చేరిన సమయంలో శనక వేసిన బంతిని కరుణరత్నెకు క్యాచ్‌ ఇచ్చి పెవీలియన్ బాట పట్టాడు.

వరుసగా తన జట్ట సహచర అటగాళ్లు వికెట్లు పడుతున్నా టీమిండియా నయా వాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా (47 బ్యాటింగ్‌; 102 బంతుల్లో 9×4) మాత్రం తనదైన శైలిలో అచితూచి అడుతూ చెడు బంతుల బరతం పడుతూ.. పట్టుదలతో అర్ధశతకానికి చేరువయ్యాడు. ఇవాళ మ్యాచ్ ముగిసే సమాయానికి చతేశ్వర్ పూజారా 47 పరుగుల వద్ద నిలువగా, అతనికి తోడుగా.. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా (6 బ్యాటింగ్‌: 22 బంతుల్లో 1×4) తన సహకారం అందిస్తున్నాడు. లంచ్ విరామం తరువాత మళ్లీ వర్షం కురియడంతో మ్యాచ్ ను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు.

శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మొదలైన తేలికపాటి జల్లు క్రమంగా పెరిగి భారీ వర్షంగా మారింది. అప్పటికి టీమిండియా 32.5 ఓవర్లకు 74/5తో ఉంది. వర్షం మధ్యలో కొంత తెరపినివ్వడంతో సిబ్బంది సూపర్‌ సోపర్లతో నీటిని బయటకు తోడేందుకు శ్రమించారు. అంతలోనే మళ్లీ వర్షం మొదలైంది. ఇలా రెండు మూడుసార్లు జరగడంతో చేసేదేమీ లేక సిబ్బంది వాన ఎప్పుడు ఆగుతుందా అని ఎదురుచూశారు. వర్షం మళ్లీ.. మళ్లీ కురవడం, వెలుతురు లేమి వల్ల రెండో రోజు ఆటను అంపైర్లు పూర్తిగా నిలిపేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind vs SL  eden gardens  Cheteshwar Pujara  Virat Kohli  cricket  

Other Articles