will play for any other country, says S Sreesanth కేరళ హైకోర్టు తీర్పుతో శ్రీశాంత్ అనూహ్య నిర్ణయం

Sreesanth open to play for other country after life ban is restored

Sreesanth, cricket, BCCI, Kerala High Court, IPL, Kerala, Indian cricket team, Rajasthan Royals, S.Sreesanth, cricket, cricket news, latest sports news, sports news, latest news, cricket

S Sreesanth hinted that he might play for another country after the Kerala High Court restored life ban on him.

కేరళ హైకోర్టు తీర్పుతో శ్రీశాంత్ అనూహ్య నిర్ణయం

Posted: 10/20/2017 06:03 PM IST
Sreesanth open to play for other country after life ban is restored

కేరళకు చెందిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కు కేరళ హైకోర్టు షాకిచ్చిన నేపథ్యంలో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకోనున్నాడని సమాచారం. ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో నిందితుడైన ఈ ఆటగాడు ఇక వేరే దేశం తరపున క్రికెట్ ఆడే యోచనలో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా శ్రీశాంత్ పట్ల బీసీసీఐ వ్యవహరిస్తున్న వైఖరికి తీవ్ర మనస్తాపం చెందిన అతను ఇక టీమిండియాకు ఆడే అవకాశం లేకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చాడు. దీనిలో భాగంగా తాను వేరే దేశానికి ప్రాతినిథ్యం వహించాలనుకున్నట్లు తన మదిలోని అలోచనను స్పష్టం చేశాడు.

బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే తాను కూడా తనదారి తాను చూసుకుంటాననే హెచ్చరికలు జారీ చేశాడు. 'నన్ను బీసీసీఐ నిషేధించింది. అంతేకానీ ఐసీసీ కాదు. అంటే నేను భారత్ తరపున మాత్రమే ఆడకూడదు. వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా. నా వయసు ఇంకా 34 ఏళ్లే. నా కెరీర్ చాలా ఉంది. ఇంకా ఆరేళ్లుగా పైగా క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఒక వ్యక్తిగా నాకు క్రికెట్ అంటే ఇష్టం. అందుచేత క్రికెట్ నే ఆడాలనుకుంటున్నా.

బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అలానే వేరే దేశానికి క్రికెట్ ఆడతా. నాపై నిషేధం కొనసాగించే నిర్ణయం బీసీసీఐకే వదిలేశా. ఇక్కడ కేరళ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం వేరు'అని దుబాయ్ లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన సందర్భంలో శ్రీశాంత్ స్పష్టం చేశాడు. గత కొన్ని రోజుల క్రితం స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేస్‌ బౌలర్‌ శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన నిషేధం కొనసాగుతుందని జస్టిస్‌ నవనీతి ప్రసాద్‌ సింగ్, జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌లతో కూడిన కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sreesanth  cricket  BCCI  Kerala High Court  IPL  Kerala  Indian cricket team  Rajasthan Royals  S.Sreesanth  

Other Articles