Ben Stokes included in Ashes squad అసీస్ తో యాషెస్ స్వాడ్ లో బెన్ స్టోక్స్..

Ben stokes included in ashes squad

James Vince,Sport,England Cricket Team,Gary Ballance,The Ashes,Ben Stokes,Joe Root,Cricket, sports news, sports, cricket news, cricket

Ben Stokes will travel to Australia with a broken finger sustained in the fight that led to his arrest earlier this week and he could still lose his job as vice-captain.

అసీస్ తో యాషెస్ స్వాడ్ లో బెన్ స్టోక్స్..

Posted: 09/27/2017 08:25 PM IST
Ben stokes included in ashes squad

అంతర్జాతీయ క్రికెట్ లో బెస్ట్ అల్ రౌండర్ గా పేరు సంపాదించుకుని జట్టు విజయాలలో అంతర్భాగంగా రాణిస్తున్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్‌ బెన్‌ స్టోక్స్ కు యాషెస్ సిరీస్ లో చోటుదక్కింది. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించిన 16 మంది జట్టు సభ్యుల్లో స్టోక్స్ కు అవకాశం లభించింది. స్టోక్స్ గత ఆదివారం తప్పతాగి ఓ వ్యక్తిని చితకబాది జైలుపాలు కావడం.. స్థానికంగా వివాదాస్పదమైంది.

దీంతో ఆయన యాషెస్ సిరీస్ అడతాడా లేదన్న అన్న సందిగ్ధత కూడా ఉత్పన్నమైంది. ఇక యాషెస్ సిరీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జట్టు యాజమాన్యం.. ఆయన కోచింగ్ క్యాంప్ కు హాజరుకాకపోవడంతో అరెస్టు నేపథ్యమే కారణమని కూడా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా బెన్ స్టోక్స్ ను విండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో దూరంగా పెట్టింది. దీంతో ఆయన యాషెస్ సిరీస్ అడతాడా లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఎట్టకేలకు ఇవాళ ప్రకటించిన 16 మంది సభ్యుల జాబితాలో ఆయన పేరు వుంది. కాగా, బెన్ స్టోక్స్ పై నేరం రుజువైన పక్షంలో ఆయనకు కనీసం ఐదేళ్ల శిక్ష పడక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : James Vince  England Cricket Team  Gary Ballance  The Ashes  Ben Stokes  Joe Root  Cricket  

Other Articles