Shoaib Malik calls MS Dhoni as Legend, GOAT! ధోనిని గోట్ అని పేర్కోన్న పాకిస్థాన్ క్రికెటర్

Ms dhoni is goat shoaib malik lavishes praise on former india skipper

Dhoni, goat, Greatest of All Time, India captain, Malik, MS Dhoni, MS Dhoni GOAT, msd, shoaib malik, Team India, india cricket team, cricket news, sports news, sports, cricket

Former India skipper MS Dhoni is regarded as one of the best cricketers ever, in the eyes of former Pakistan skipper Shoaib Malik, Dhoni is simply the best.

ధోనిని గోట్ అని పేర్కోన్న పాకిస్థాన్ క్రికెటర్

Posted: 09/15/2017 09:30 PM IST
Ms dhoni is goat shoaib malik lavishes praise on former india skipper

టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీని అంటే ఎరుగని వర్తమాన క్రికెటర్లు వుండరు. అది పాకిస్థాన్ అయినా.. లేక అప్ఘనిస్థాన్ అయినా సరే. ధోనికి వున్న పేరు అలాంటి. ది బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గానే కాకుండా భారత దేశ క్రికెట్ జట్టుకు మరుపురాని విజాయాలను అందించిన కెప్టెన్ గా అతని పేరును ప్రస్తావనకు తీసుకురాని అభిమానులు వుండరు. అలాంటి ధోనిని పాకిస్థాన్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్ గోట్ అన్నాడు.

అదేంటి భారత్ కు చెందిన సానియా మిర్జాను పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. భారత్ కు చెందిన క్రికెటర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని అవేశానికి లోను కాకండి. గోట్ అంటే మేక అనేగా అనుకుంటున్నారు. అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఆయన అన్న గోట్ జీవోఏటి. అదేంటి అంటారా.. అర్థం తెలిస్తే.. హర్షిస్తారు.

ట్విటర్ వేదికగా షోయబ్ తన అభిమానులతో కలసి సరదా అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీపై నీ అభిప్రాయం ఏంటి? అని ఓ అభిమాని అడగ్గా.. దానిని బదులిస్తూ ధోనీ ‘గోట్‌’ అని అన్నాడు. అది మాకు తెలుసు గోట్ అంటే ఏంటీ అంటున్నారు కదూ.. గోట్ అంటే జీవోఏటి. దానర్థం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని కూడా బదులిచ్చాడు. పాక్‌ క్రికెటర్‌ నుంచి ఊహించని ప్రశంస రావడంతో భారత క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Greatest of All Time  MS Dhoni  GOAT  shoaib malik  Team India  Pakistan  cricket  

Other Articles