Pandya dispels doubts over Test with fifty on debut తొలిమ్యాచ్ లోనే అంచనాలను నిలబెట్టుకున్న అల్ రౌండర్..

Hardik pandya dispels doubts over test capabilities with blazing fifty on debut in galle

india vs sri lanka, galle test, hardik pandya, virat kohli, maiden test match, half century, Team India, cricket news, cricket, sports news, latest news

Hardik Pandya walks out on Test debut with the scorecard reading 491/6. He did not need an invitation to lash out. India had never lost a Test match after posting a score in excess of 450.

తొలిమ్యాచ్ లోనే అంచనాలను అందుకున్నాడు

Posted: 07/27/2017 08:02 PM IST
Hardik pandya dispels doubts over test capabilities with blazing fifty on debut in galle

పరిమిత ఓవర్ల క్రికెట్ లో తన సత్తాను చాటుకున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. అరంగేట్రపు టెస్టులో సైతం ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్ ద్వారా టెస్టు ఫార్మాట్ లో అరంగ్రేటం చేసిన పాండ్యా అర్థశతకంతో రాణించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో హార్దిక్ పాండ్యా 48 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో హాప్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పాండ్యా నిలకడగా ఆడాడు. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చెడ్డ బంతుల్ని బౌండరీ దాటించాడు.

పాండ్యాకు జతగా మరో ఎండ్ లో వున్న మహమ్మద్ షమీ(30; 30 బంతుల్లో 3 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేశాడు. ఇక చివర్లో పాండ్యా, షమీలు రాణించడంతో పాటు ఉమేశ్ యాదవ్(11 నాటౌట్;10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఆఖరి వికెట్ గా పాండ్యా పెవిలియన్ చేరడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 600 పరుగుల వద్ద ముగిసింది. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ ఆరు వికెట్లు సాధించగా, లుహిరు కుమార మూడు వికెట్లు తీశాడు. కెప్టెన్ రంగనా హెరాత్ కు వికెట్ లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles