హర్మన్ ప్రీత్ కల నెలవేర్చిన పంజాబ్ సీఎం | Finally Star Batswoman got her dream job

Dsp job to harmanpreet kaur

Amarinder Singh, Harmanpreet Kaur, Harmanpreet Kaur DSP Job, Harmanpreet Kaur Punjab Reward, Harmanpreet Kaur Badal Promise, Harmanpreet Kaur Punjab Daughter

Pubjab CM Amarinder Singh offers post of DSP to Harmanpreet Kaur. and Rs 5 lakh reward for Dashing Batswoman.

ప్రపంచకప్ లో విరుచుకుపడ్డ హర్మన్ ప్రీత్ కు డీఎస్పీ ఉద్యోగం

Posted: 07/24/2017 11:08 AM IST
Dsp job to harmanpreet kaur

మహిళల ప్రపంచ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్ లో ఓటమి పాలైన టీమిండియాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ప్రయాణంలో అద్భుతంగా రాణించిన పంజాబ్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ కు అక్కడి ప్రభుత్వం బంఫరాఫర్ ప్రకటించింది. ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించాడు.

సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సుడిగాలి ఇన్నింగ్స్ తో కేవలం 115 బంతుల్లోనే 171 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమెను పంజాబ్ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించింది. గత ప్రభుత్వం హర్మన్ తోపాటు చాలా మంది ఆటగాళ్లను దారుణంగా నిర్లక్ష్యం చేసింది. వారికి ఎలాంటి నజరానాలు ఇవ్వకుండా ఘోరంగా అవమానించాయి. అందుకే మా ప్రభుత్వం వారిని సముచితంగా గౌరవించాలని నిర్ణయించుకుందంటూ సీఎం ప్రకటించాడు. ఉద్యోగంతోపాటు 5 లక్షల నజరానా కూడా ప్రకటించాడు.

గతంలో ఆమె పోలీస్ శాఖలో ఉద్యోగం కావాలని కోరితే నిరాకరించటంతో ఆమె ముంబై రైల్వే తరపున ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నేషనల్ టీంకు సెలక్ట్ కావటం, రాణించటం, ప్రపంచకప్ లో సత్తా చాటటంతో ప్రశంసలు కురిశాయి. తుది వరకు భారత మహిళా క్రికెటర్లు పోరాడినప్పటికీ, కీలక సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనై, 9 పరుగుల తేడాతో ఓటమిపాలయిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab  CM Amarinder Singh  Harmanpreet Kaur  DSP Job  

Other Articles