BCCI demands Elaborate Version of Sehwag's Bio Data

Sehwag forwards two line resume for india coach job

Virender Sehwag, Sehwag Resume, Virender Sehwag Bio Data, Virender Sehwag Resume, Sehwag Simple Biodata, Sehwag Resume, Sehwag Resume, BCCI Demands Sehwag, Sehwag Full Biodata, Sehwag Shocks BCCI

Virender Sehwag forwards two-line resume to BCCI for Team India Head coach job. BCCI said that the board had to ask him to send his CV too along with his application. His application just said that he is a ‘mentor and a coach of Kings XI Punjab and has played with all the boys before’.

వీరూ రెజ్యుమ్ లో అసలేం ఉంది?

Posted: 06/06/2017 11:51 AM IST
Sehwag forwards two line resume for india coach job

బీసీసీఐ కొత్త కోచ్ పదవి రేసులో టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం దరఖాస్తులు అల్రెడీ మొదలవ్వగా, వీరూ అప్లై కూడా చేసుకున్నాడు. అయితే వీరూ ముక్కుసూటి తనం, వ్యంగ్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన సెహ్వాగ్ తన అప్లికేషన్ లో కూడా అదే పంథాను చూపించాడు. అతను పంపిన రెజ్యూమ్ చూసిన బీసీసీఐ అధికారులు అవాక్కయ్యారంట.

ఇంతకీ సెహ్వాగ్ రెజ్యూమ్ లో ఏముందో తెలుసా?. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవెన్ జట్టుకు కోచ్ అండ్ మెంటర్ గా ఉన్నా అంటూ ఓ ముక్క, ఇంతకు ముందు ఈ కుర్రాళ్లందరితో కలసి ఆడా అంటూ మరో ముక్కలతో బయో డేటాను పంపాడంట. ఇక ఈ అప్లికేషన్ ఫాంను చూసిన బీసీసీఐ మళ్లీ సెహ్వాగ్ దరఖాస్తు పంపాలని కోరింది

దయచేసి పూర్తి వివరాలతో కూడిన బయోడేటాను పంపించ గలరు అంటూ దాదాపు బతిమాలుకున్నంత పని చేసిందని టాక్. ఫస్ట్ టైం ఈ పదవి కోసం పోటీ పడుతున్నాడు కాబట్టి పూర్తి వివరాలతో పంపాలని కోరినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక ఈ రేసులో ప్రస్తుత కోచ్ కుంబ్లేతోపాటు, ఆస్ట్రేలియన్ మాజీ బౌలర్ టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, దేశీవాళీ క్రికెట్ దిగ్గజాలు దొడ్డ గణేష్, లాల్ చంద్ రాజ్ పుత్ లు పోటీపడుతున్నారు. బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యులైన సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లు లండన్ నుంచి స్కైప్ ద్వారా ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  BCCI  Head Coach Application  

Other Articles