Champions Trophy tougher than World Cup: Virat Kohli ఛాంపియన్స్ ట్రోఫిని నిలబెట్టుకుంటామని కోహ్లీ ధీమా

Icc champions trophy 2017 virat kohli wants to win without losing a game

india, virat kohli, icc champions trophy 2017, cricket, MS dhoni, Yuvraj singh, England, cricket news, sports news, spots, cricket

India will be looking to retain the ICC Champions Trophy without losing any matches and the only thing that matters to skipper Virat Kohli is to win matches for India.

ఛాంపియన్స్ ట్రోఫిని నిలబెట్టుకుంటామని కోహ్లీ ధీమా

Posted: 05/24/2017 09:38 PM IST
Icc champions trophy 2017 virat kohli wants to win without losing a game

ఇంగ్లాండ్ వేదికగా వ‌చ్చేనెల 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీని నిలబెటుకుంటామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా ధీమా వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లు పటిష్టంగానే ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించడం కలిసొచ్చే అంశమని అన్నాడు. ప్రపంచ కప్ కన్నా ఛాంపియన్స్ ట్రోఫీయే కష్టమైనదని ఎందుకంటే ఈ టోర్నీలో అన్ని టాప్ జట్లే పాల్గంటాయని చెప్పాడు. తన నేతృత్వంలో భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌కు పయనం కానున్న నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ ట్రోఫీలో తాము విజేతలుగా నిలవాలంటే ఆడుతున్న ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాల్సిందేనని అన్నాడు.

యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు మాతో ఉండటం జట్టుకు కలసివచ్చే అంశమేకాకుండా జట్టుకు అదనపు బలమన్నాడు. ప్రస్తుతం టీం అన్ని విభాగాల్లో బాగుందని చెప్పాడు. గ్రూప్‌లో టాప్‌లో ఉండ‌డానికి ప్రయ‌త్నిస్తామ‌ని అన్నాడు. వ‌చ్చేనెల 4న‌ పాక్‌తో ఇండియాకు తొలి మ్యాచ్ ఉంద‌ని చెప్పాడు. 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీలో రాణించి, క‌ప్పు కొట్టిన‌ట్లే ఈ సారి కూడా రాణించి అన్ని మ్యాచుల్లోనూ గెలుస్తామ‌ని ఆశాభావం వ్యక్తం చేశాడు. గ‌త ఛాంపియ‌న్స్ ట్రోఫీలో రోహిత్, ధావ‌న్‌, అశ్విన్, జ‌డేజా బాగా ఆడార‌ని గుర్తు చేశాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  ICC  England  virat kohli  cricket  

Other Articles