ఐపీఎల్ లో ఐదేళ్ల తర్వాత ఢిల్లీ ఫీట్... పుణ్ కొత్త రికార్డు | Delhi Daredevils thrash RPS by 97 runs.

Delhi daredevils to big win over rising pune supergiant

Delhi Daredevils, IPL 2017, IPL 10, Delhi Daredevils Rising Pune Supergiant, Rising Pune Supergiant Lost, Rising Pune Supergiant Delhi Daredevils

Delhi Daredevils eye maiden win against batting-heavy Rising Pune Supergiant. Samson 102 helps DD to 97-run win over RPS.

పుణే సూపర్ జెయింట్స్ పై డేర్ డెవిల్స్ భారీ విక్టరీ

Posted: 04/12/2017 09:09 AM IST
Delhi daredevils to big win over rising pune supergiant

ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ ‘డేర్‌డెవిల్స్‌’ ఆట చూపింది. యువ బ్యాట్స్‌మన్‌ సంజూ సామ్సన్‌ చాలా రోజుల తర్వాత అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ తొమ్మిది బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఐదేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు 200 పరుగుల మార్కును దాటించేలా చేశాడు. అటు జహీర్‌ ఖాన్, అమిత్‌ మిశ్రాల బౌలింగ్‌ ధాటికి రహానే నేతృత్వంలో బరిలోకి దిగిన రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 108 పరుగులకే కుప్పకూలి ఘోరంగా ఓడింది.

యువ బ్యాట్స్‌మన్‌ సంజూ సామ్సన్‌ (63 బంతుల్లో 102; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్‌ సెంచరీకి తోడు ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ (9 బంతుల్లో 38 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడవ్వడంతో డీడీ విజయాల బోణీ చేసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌పై 97 పరుగుల తేడాతో ఢిల్లీ నెగ్గింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. రిషభ్‌ పంత్‌ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు), బిల్లింగ్స్‌ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.దీపక్‌ చహర్, తాహిర్, జంపాలకు ఒక్కో వికెట్‌ దక్కింది.

పుణే విలవిల...

అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే జట్టును ఢిల్లీ బౌలర్లు దారుణంగా దెబ్బతీయడంతో 16.1 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. స్మిత్‌ కడుపునొప్పితో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. మయాంక్‌ చేసిన 20 పరుగులే పుణే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఓ భారీ సిక్సర్‌తో అలరించిన ధోని (14 బంతుల్లో 11; 1 సిక్స్‌) కూడా కొద్దిసేపటికే వెనుదిరిగి నిరాశపరిచాడు. అటు రన్‌రేట్‌ భారీగా పెరిగిపోవడంతో పాటు మిగతా వికెట్లు కూడా త్వరగానే పడడంతో పుణేకు భారీ ఓటమి ఎదురైంది. జహీర్, స్పిన్నర్‌ మిశ్రాలకు మూడేసి, కమిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. సామ్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

 

కొత్త రికార్డులు... 

ఈ మ్యాచ్ లో ఫుణే జట్టు సభ్యులంతా క్యాచ్ ల ద్వారానే అవుట్ కావటం ఓ రికార్డు అనే చెప్పుకోవాలి. ఇక ఐపీఎల్ లో ఐదేళ్ల తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 200 పరుగుల మైలు రాయిని దాటింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2017  Delhi Daredevils  Rising Pune Supergiant  

Other Articles