మిథున్‌ మన్హాస్‌తో పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఫిక్స్..! Mithun Manhas named Kings XI Punjab's assistant coach

Mithun manhas named kings xi punjab s assistant coach

mithun manhas, kings punjab, india, bcci, IPL, coach, ranji trophy, indian premium league, cricket

Mithun Manhas has been roped in as the assistant coach by Kings XI Punjab respectively for the upcoming season of the Indian Premier League (IPL).

మిథున్‌ మన్హాస్‌తో పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఫిక్స్..!

Posted: 02/18/2017 06:38 PM IST
Mithun manhas named kings xi punjab s assistant coach

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ లో టైటిల్ సాధించాలన్న కృతనిశ్చయంతో ఉంది పంజాబ్ సూపర్ కింగ్స్. తమ జట్టును ఈ దిశగా ప్రేరేపించి.. ఉత్తమ ఫలితాలను సాధించే దిశలో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు తమ అసిస్టెంట్‌ కోచ్‌ను కూడా నియమించుకుంది. ఐపీఎల్ మ్యాచ్ లు అడిన అనుభవంతో పాటు రంజీట్రోఫీలలో కోచ్ గా వ్యవహరించిన అనుభవాన్ని కలగలిపిన మిథున్‌ మన్హాస్‌ను అసిస్టెంట్ కోచ్ ఎంపిక చేసింది. ఆయన జట్టుకు ప్రేరణ కల్సిస్తారని భావిస్తుంది జట్టు యాజమాన్యం.

గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్, పుణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. అలాగే రంజీల్లో ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగాడు. అలాగే బ్యాటింగ్‌ కోచ్‌గా జె.అరుణ్‌ కుమార్‌ వ్యవహరించనున్నాడు. రంజీ ట్రోఫీలో అతను కర్ణాటక జట్టు కోచ్‌గా వ్యవహరించగా ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడిన అనుభవం ఉంది. వీరితో పాటు ఫిజియోథెరపిస్ట్‌గా అమిత్‌ త్యాగి, మనోజ్‌ కుమార్‌ యోగా శిక్షకుడిగా ఉండనున్నారు. ఆర్‌.శ్రీధర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా కొనసాగుతారు. వీరంతా టీమ్‌ మెంటార్‌గా ఉన్న సెహ్వాగ్‌ ఆధ్వర్యంలో పనిచేస్తారని జట్టు వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mithun manhas  kings punjab  india  bcci  IPL  coach  ranji trophy  indian premium league  cricket  

Other Articles

Today on Telugu Wishesh