నేనెవరకీ పోటీ కాదు.. ఎవరితో పోటీ లేదు: సాహా Wriddhiman Saha rules out competition with Parthiv Patel

Wriddhiman saha rules out competition with parthiv patel

india vs england, Wriddhiman Saha, Parthiv Patel, competition, indian test cricket, test squad, india, England, kolkata, cricket

India wicketkeeper Wriddhiman Saha on Thursday brushed aside talk of competition with Parthiv Patel for a place in the Test cricket

నేనెవరకీ పోటీ కాదు.. ఎవరితో పోటీ లేదు: సాహా

Posted: 12/30/2016 05:44 PM IST
Wriddhiman saha rules out competition with parthiv patel

దశాబ్ధకాలం తరువాత టీమిండియా జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్తో తనకు ఎటువంటి పోటీ లేదని గాయం కారణంగా జట్టుకు దూరమైన మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పష్టం చేశాడు. తాను ఏ ఒక్క ఆటగాడికి పోటీనే కాదని పేర్కొన్న సాహా తన అవకాశాలపై కూడా ఎటువంటి ఆందోళన లేదన్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లీగ్  మ్యాచ్లో భాగంగా మోహన్ బగాన్ తరుపున ఆడటానికి కోల్ కతాకు విచ్చేసిన  సాహా.. అసలు పార్థీవ్తో తనకు పోటీ ఉందని భావించడం లేదన్నాడు.

'పార్థీవ్తో పోటీ ఉందని అనుకోవడం లేదు. జాతీయ జట్టుకు తిరిగి  ఆడాలనే క్రమంలో పార్థీవ్ విపరీతంగా శ్రమించాడు. టెస్టు సిరీస్లో పార్థీవ్ మెరుగ్గా ఆడి జట్టు విజయంలో పాలు పంచుకున్నాడు. మా ఎంపికపై సెలక్టర్లకు ఏదైతే సరైనది అనిపిస్తోంది అదే చేస్తారు. అదంతా ఓపెన్ గానే ఉంటుంది. దీని గురించి పెద్దగా పట్టించుకోను. అలా అని మరొక ఆటగాడి ప్రదర్శనపై కూడా ఎటువంటి ఆందోళన లేదు' అని సాహా పేర్కొన్నాడు ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్లో 65.00 సగటుతో పార్థీవ్ 195 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  Wriddhiman Saha  Parthiv Patel  india  England  cricket  

Other Articles