ముందుగానే గౌరవప్రదంగా తప్పుకున్న పవార్ Sharad Pawar steps down from MCA president's post

Sharad pawar steps down as president of mumbai cricket association

Supreme court, justice lodha committee, bcci, mca, sharad pawar, mumbai cricket association, cricket

Sharad Pawar was in his second innings as president of the MCA after being elected last year for a two-year term had resigned for the post.

ముందుగానే గౌరవప్రదంగా తప్పుకున్న పవార్

Posted: 12/17/2016 07:39 PM IST
Sharad pawar steps down as president of mumbai cricket association

క్రికెట్‌ సమూల ప్రక్షాళనకు ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసుల అములు నేపథ్యంలో క్రమంగా బిసిసిఐ సహా రాష్ట్ర సంఘాలలో కదలికలను తీసుకోస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ (76) ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నారు. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులు అమలలో భాగంగా ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బీసీసీఐలో, దాని అనుబంధ యూనిట్లలోని బాధ్యులు, అధికారులకు వయస్సు పరిమితి, కాలపరిమితి ఉండాలని లోధా కమిటీ సిఫారసు చేసింది.

ఈ సిఫారసు అమలైతే.. శరద్‌ పవార్‌పై వేటు పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్వచ్ఛందంగా తప్పుకొన్నట్టు భావిస్తున్నారు. రాజకీయాలతోపాటు క్రికెట్‌ అనుబంధం కొనసాగిస్తున్న పవార్‌ 2005 నుంచి 2008 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2010-12 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2015 జూన్‌లో ఎంసీఏ అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికయ్యారు. అయితే, 70 ఏళ్లు దాటిన వాళ్లు క్రికెట్‌ సంఘాల్లో ఉండరాదని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme court  justice lodha committee  bcci  mca  sharad pawar  mumbai cricket association  cricket  

Other Articles