విండీస్ ఇప్పట్లో విజాయలను నమోదు చేయడం కష్టం I can take on any bowler now, says Chris Gayle

Chris gayle thinks windies may never regain glory days in tests

Chris Gayle, West Indies, Cricket, Dwayne Bravo, virat kohli, super man, west indies test cricket, Caribbean cricket, cricket

West Indies flamboyant Chris Gayle feels “it will be difficult” for the Caribbean islands to regain their glory days in Test cricket in the near future.

విండీస్ ఇప్పట్లో విజాయలను నమోదు చేయడం కష్టం

Posted: 12/13/2016 07:41 PM IST
Chris gayle thinks windies may never regain glory days in tests

తమ దేశం టెస్టు క్రికెట్ లో విజయాలను నమోదు చేసుకోవడం సమీప భవిష్యత్తులో కూడా కష్టమేనని ఆ దేశ దిగ్గజ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు పూర్వవైభవం తీసుకురావడం కూడా కష్టసాథ్యమైన పనేనన్నాడు. సమీప భవిష్యత్తులో కూడా టెస్టుల్లో తమ జట్టు రాణించడం కష్టమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒకప్పుడు టెస్టుల్లో కరేబియన్ బౌలర్లు జట్టుకు విజయాలను అందించేవారని, అయితే ఇప్పుడు అ పద్దతి పూర్తిగా మారిపోయిందన్నారు.

ప్రస్తుతం బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ విభాగంలోనూ రాణించడం అత్యంత అవసరంగా మారిపోయిందన్నాడు. రెండు విభాగాలు సమంగా రాణించినప్పుడే విజయాలు నమోదవుతాయన్నాడు. పనిలో పనిగా టెస్టు క్రికెట్ లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని గేల్ సూపర్ మాన్ తో పొల్చారు. తనకు అవకాశమిస్తే.. 2019లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో అడతానని తన మదిలోని మాటను చెప్పాడు. తన వన్డే క్రికెట్ కెరీర్ కూడా అప్పటి వరకే కోనసాగుతుందన్నాడు.

క్రిస్ గేల్ 103 టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు బాదడంతో పాటు మొత్తం 7214 పరుగులు చేశాడు. ఇటీవల తమ జట్టు స్వదేశంలో భారత్ చేతిలో, విదేశాలలో పాకిస్తాన్ చేతిలో సిరీస్ లు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశాడు. ఏకాగ్రత, నిరంతర కృషి ఉంటేనే ఈ పార్మాట్లో రాణించగలరని చెప్పాడు. టీ20 అనేది తక్కువ సమయంలో మ్యాచ్ ముగుస్తుంది కనుక కొద్దిసేపు రాణిస్తే సరిపోతుందని.. అందుకే వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ లు నెగ్గుతుందన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chris Gayle  West Indies  Cricket  Dwayne Bravo  Caribbean cricket  cricket  

Other Articles