జిడ్డుగాళ్లు.. ఏడుగురిని మార్చిన అవుట్ కాలేదు | vijay pujara Innings Indias reply to england 400.

England vs india fourth test day two

Murali Vijay and Cheteshwar Pujara, Mumbai Test, England India 4th test, England seven bowlers, Vijay Pujara Day 2, Vijay half century Mumbai test, Mumbai Test England

Murali Vijay and Cheteshwar Pujara frustrate England's bowlers on day two in Mumbai Test.

ఏడుగురు బౌలర్లు, ప్చ్.. ఏ మాత్రం లాభం లేదు

Posted: 12/09/2016 05:16 PM IST
England vs india fourth test day two

ఇంగ్లాండ్ పై నాలుగో టెస్ట్ లోనూ విజయం సాధించేందుకు టీమిండియా శ్రమిస్తోంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ కు దీటుగా సమాధానమిస్తోంది. నిన్న ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగుల స్కోర్ తో శుక్రవారం ఉదయం రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆతిథ్య జట్టు ముందు మంచి లక్ష్యాన్నే ఉంచింది. 400 పరుగులకు అలౌట్ అయ్యింది. భారత స్పిన్నర్లు అశ్విన్ 6 వికెట్లు, జడేజా 4 వికెట్లతో రాణించినప్పటికీ ఈ స్కోర్ సాధించటం విశేషం.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మొదట్లోనే దెబ్బపడింది. 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేఎల్ రాహుల్ మొయిన్ అలీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మురళీ విజయ్ కు పుజారా జత కలిశాడు. ఆ తర్వాత వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో మురళి 70 పరుగులు, పుజారా 47 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ 7 మంది బౌలర్లను మార్చినా పెద్దగా ఫలితం లేకపోయింది.

దీంతో టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక్క వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. మూడు రోజు ఆటలో తొలి రెండు సెషన్లు అత్యంత కీలకం కానున్నాయి. బంతి బాగా టర్న్ అయితే మాత్రం మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : England  Team India  Mumbai Test  Vijay and Pujara  

Other Articles