మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నమెంట్ తుది పోరులో భారత్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఇప్పటికే భారత్ మహిళలు ఫైనల్ కు చేరగా, మరో బెర్తు ఖరారు కోసం చివరి లీగ్ మ్యాచ్ వరకూ వీక్షించాల్సి వచ్చింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది. తొలుత థాయ్‌లాండ్‌ను 51 పరుగులకే కూల్చేసిన పాకిస్తాన్.. ఆ తరువాత లక్ష్య ఛేదనలో ఐదు వికెట్ల మాత్రమే కోల్పోయి 11.4 ఓవర్లలో గెలుపొందింది.
స్వల్ప లక్ష్యాన్ని సాధించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు అయేషా జాఫర్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, బిస్మా మరూఫ్(4) నిరాశపరిచింది. ఆపై అస్మావియా ఇక్బాల్(24), నిదా దార్(14)లు పరిస్థితిన చక్కదిద్దారు. మూడో వికెట్ కు 31 పరుగులు జోడించి పాక్ కు విజయాన్ని ఖరారు చేశారు. ఈ టోర్నీలో భారత్ ఐదు వరుస విజయాలతో ఫైనల్ కు చేరగా, పాకిస్తాన్ నాలుగు విజయాలతో తుది పోరుకు చేరింది. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more