విదేశాలలో విజయాల పరంపరంకు కోహ్లీసేన సిద్దం కావాలి India can win matches overseas, says Virender Sehwag

India can win matches overseas says virender sehwag

India vs England, virat kohli, virat kohli captaincy, Team india, fourth test, virender sehwag, sehwag, virat kohli, kohli, india vs england, england vs india, ind vs eng, india england, score update, r ashwin, wriddhiman saha, Adil Rashid, India vs England score, cricket news, cricket

Indai Test team under Virat Kohli has been unbeaten at home having won against South Africa and New Zealand and leading England in current series.

విదేశాలలో విజయాల పరంపరంకు కోహ్లీసేన సిద్దం కావాలి

Posted: 12/03/2016 06:08 PM IST
India can win matches overseas says virender sehwag

అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా క్రికెట్పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విజయాలు ఇలాగే కొనసాగితే.. 2002-04 సంవత్సరాల్లో సౌరవ్ గంగూలీ నేతృత్యంలోని భారత్ జట్టు అందుకున్న విజయాలను కూడా అధిగమించి ముందుకుసాగుతుందని అశాభావం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా విదేశీగడ్డలపై టెస్టు మ్యాచ్ లలో గంగూలీ అందుకున్న విజయాలను కూడా కోహ్లీ అధిగమించి.. నూతన చరిత్రను సృష్టించడగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ టెస్టు జట్టు.. విదేశాల్లో కూడా విజయాలు సాధించేగలదని ధీమా వ్యక్తం చేశాడు. స్వదేశంలో విరాట్ సారథ్యంలోని భారత జట్టు అజేయంగా ఉందని.. ఇదే తరహా విజయ పరంపరను విదేశాల్లో కూడా కొనసాగించే జట్టు ఇది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇక విదేశాల్లో విజయాలను సాధించడానికి అపసోపాలు పడాల్సిన అవసరం లేదన్నాడు. విరాట్ సైన్యంలో ఇప్పుడు పటిష్టమైన బౌలింగ్ సైన్యం కూడా వుందని అది విదేశీ గడ్డలపై విజయాలను కూడా సుసాధ్యం చేస్తుందన్నాడు.

ప్రధానంగా భారత పేస్ బౌలింగ్ బలం బాగా మెరుగుపడటమే ఇందుకు కారణం. మంచి బౌలింగ్తో సత్తా చాటితే విదేశాల్లో విజయాలు ఏమాత్రం కష్టం కాదు. ఇప్పుడు మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ తదితర ఫాస్ట్ బౌలర్లతో కూడిన జట్టు భారత్కు ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. తన క్రికెట్ జర్నీలో దేశవాళీ టోర్నీలో నిలకడగా ప్రదర్శనలు చేసిన వారు చాలా మంది ఉన్నారని, అదే సమయంలో వారికి తగినంత గౌరవం కూడా లభించలేదని ఆనాటి విషయాల్ని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  sourav ganguly  virendra sehwag  england  Team india  cricket  

Other Articles