తన మనస్సు, హృదయం జట్టుతోనే వున్నాయన్న రాహుల్ it was heartbreaking to miss out says kl rahul

Rahul says it was heartbreaking to miss out on the new zealand series

kL rahul, vizag, indian squad, second test, bcci, visakhapatnam, Virat Kohli, India v England, Rajkot, Team India, England cricket, Gautam Gambhir, India, Joe Root, Murali Vijay, Rajkot, Ravichandran Ashwin, Sports, Virat Kohli, Umesh Yadav, India cricket

To start off, it was really heartbreaking to miss out on a home series after a long time." Rahul managed to play only in the first Test against the Kiwis after which a hamstring injury ruled him out of the remainder of the series.

తన మనస్సు, హృదయం జట్టుతోనే: రాహుల్

Posted: 11/16/2016 06:48 PM IST
Rahul says it was heartbreaking to miss out on the new zealand series

గాయంతో బాధపడుతున్నా.. తన మనస్సు, హృదయం మాత్రం జట్టుతోనే వున్నాయని.. న్యూజీలాండ్ సిరీస్ కు గాయంతో దూరమైన టీమిండియా బ్యాట్స్‌ మన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నారు. స్వదేశంలో సిరీస్‌ జరుగుతుండగా తాను ఇంటికే పరిమితం కావాల్సి రావడం దురదృష్టకరంగా పేర్కొన్నాడు. తొడ కండరాల గాయంతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం బోర్‌ కొట్టిందని చెప్పాడు. తన మనసంతా టీమిండియాతోనే ఉందని ‘బీసీసీఐ టీవీ’తో మాట్లాడుతూ అన్నాడు.

‘చాలా కాలం తర్వాత హోం సిరీస్‌ లో ఆడలేకపోవడం బాధ కలిగించింది. గాయంతో జట్టుకు దూరం కావడంతో గుండె పగిలినంతపనైంది. విదేశాల్లో చాలా సిరీస్‌ లు ఆడాను. ప్రస్తుతం ఫామ్‌ లో ఉన్నాను. హోంసిరీస్‌ లో బాగా ఆడాలని అనుకున్నాను. గాయంతో నా ఆశలపై నీళ్లు చల్లింద’ని వాపోయారు.

విశ్రాంతి సమయంలో ఫిట్‌ నెస్‌ పై దృష్టి పెట్టానని చెప్పాడు. ‘ఖాళీగా ఇంటిదగ్గర కూర్చోవడం బోర్‌ కొట్టింది. ఈ ఆరు వారాలు భారంగా గడిచింది. మొదటి రెండు వారాలు అయితే ఏమీ చేయలేకపోయాను. ఉదయం నిద్ర లేవగానే ఫిజియోథెరపిస్ట్‌ దగ్గరకు వెళ్లడం, తర్వాత రీహెబిలిటేషన్‌ సెంటర్‌ లో గడపడంతోనే సరిపోయింది. మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తానా అని ఆలోచిస్తూనే గడిపాను. నా మనసంతా టీమిండియాతోనే ఉండేది. టీమ్‌ లో ఉన్నట్టే అనుకునేవాడిని. ఫుల్ ఫిట్ నెస్‌ సాధించి తొందరగా జట్టులో చేరాలని తపన పడుతుండేవాడిన’ని రాహుల్‌ చెప్పాడు. విశాఖపట్నంలో గురువారం నుంచి ఇంగ్లండ్‌ తో జరగనున్న రెండో టెస్టులో రాహుల్‌ ఆడనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India v England  kL rahul  vizag  indian squad  second test  bcci  visakhapatnam  Team India  cricket  

Other Articles