అతిధులను ‘కంగారె’త్తించిన సఫారీలు South Africa bounce back on eventful day

Perth test batting collapse hands proteas momentum as hosts crumble again

Australia, Australia vs South Africa, Cricket, Dale Steyn, Faf du Plessis, Kagiso Rabada, Mitchell Starc, South Africa, South Africa vs Australia, Steve Smith, Test cricket, Australia cricket, south africa cricket, cricket, cricket news, sports, sports news

Australia has undone its good opening day work in the first Test against South Africa, collapsing on day two to surrender control of the match at the WACA.

అతిధులను ‘కంగారె’త్తించిన సఫారీలు

Posted: 11/04/2016 06:47 PM IST
Perth test batting collapse hands proteas momentum as hosts crumble again

అతిథ్య జట్టు అస్ట్రేలియాతో జరుగుతున్న తొలిటెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలను తొలిరోజున మట్టికరింపించామని బీరాలు పోయిన అసీస్ కు అదే అనుభవం పునారవృతమైంది. రెండో రోజు సఫారీ బౌలర్లు అస్ట్రేలియా బ్యాట్స్ మెన్లను కంగారెత్తించారు. దీంతో వన్డే సిరీస్ తరహాలో దుమ్మరేపి.. టెస్టు సిరీస్ ను కూడా క్లీన్ స్వీస్ తమ ఖాతాలో వేసుకుందామని భావిస్తున్న సఫారీలకు వెయ్యేనుగుల బలం కలసివచ్చినట్లైంది.

పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్లో 105 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బరిలోకి దిగిన అసీస్ కేవలం 139 పరుగులను జోడించేందుకు పది వికెట్లను సమర్పించుకోవాల్సి వచ్చింది. క్రితం రోజున 73 పరుగులు సాధించిన వార్నర్ మరో 24 పరుగులు జోడించి వెనుదిరుగగా, మార్ష్ కూడా 63 పరుగల వద్ద పెవీలియన్ కు చేరాడు. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్లు క్రీజులోకి రావడమే అలస్యం అన్నట్లు వెనుదిరిగి వెళ్లారు. వోగ్స్, నివిల్ సిడెల్ మినహా ఎవరు పది పరుగులుకు దాటలేదు.

దీంతో అసీస్ 244 పరుగులకు అలౌట్ అయ్యింది. ఫీలండర్ 4, రాబడ 2, మహారాజ్ 3, స్టీన్ ఒక్క వికెట్ తీసుకున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సఫారీలు రెండో రోజు అట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు సాధించారు. ఎల్గర్ 46 పరుగులతో అర్థశతకానికి చేరువగా కోనసాగుతుండగా, అటు డుమినీ కూడా 34 పరుగులతో అర్థశతకానికి మరో 16 పరుగులు దూరంలో నిలిచాడు. ఇక కుక్ 12 పరుగుల వద్ద సెడిల్ బౌలింగ్లో మార్షకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ కు చేరగా, అమ్లా హాజిల్ వుడ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యి ఒక్క పరుగుకే వెనుదిరిగాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Steve Smith  Peter Siddle  Australia  South Africa  perth test  cricket  

Other Articles