టీమిండియా ఓటమికి పిచ్ కారణమా..? ధోని వ్యాఖ్యలు MS Dhoni backs youngsters after Ranchi ODI defeat

Dhoni calls for patience with india s inexperienced middle order

Dhoni brings out his deadly back-flick, New Zealand defend 260 to keep series alive, MS Dhoni, India v New Zealand at Ranchi, New Zealand tour of India, India cricket, New Zealand, teamindia, new zealand, india vs new zealand, ind vs nzl, ind vs nzl mohali, sports, sports news, cricket

MS Dhoni has asked for more patience to be shown with India's inexperienced middle order after they couldn't complete a chase of 261 on a sluggish Ranchi pitch.

టీమిండియా ఓటమిపై ధోని వ్యాఖ్యలు, అదే కారణమట..

Posted: 10/27/2016 03:54 PM IST
Dhoni calls for patience with india s inexperienced middle order

మొహాలీ వన్డేలో ఫామ్ లోకి వచ్చిన ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన సొంత గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లలో మరింతగా చెలరేగిపోతాడని, ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలుపుదిశగా పయనింపజేస్తాడని కలలు గన్న అభిమానుల అశలపై నీళ్లు ఆయన నీళ్లు చల్లారు. నాల్గవ వన్డేలో ఓటిమిపై అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఓటమికి రాంఛీలోని పిచ్ దే పూర్తి బాధ్యతని నెపాన్ని పిచ్ పైకి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ పరాజయంపై ఆయన అసలేం అన్నారంటే...

ఇక్కడ స్కోరు బోర్డుపై లక్ష్యం పెద్దగా లేకపోయినప్పటికీ, సరైన భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతోనే ఓటమి పాలయ్యామన్నాడు. స్లో వికెట్ పై స్ట్రైక్ రొటేట్ చేయడం కష్టంగా మారిందిని, ఇలాంటి పిచ్ పై చేజింగ్ కూడా కష్టమని చెప్పుకోచ్చాడు. ఈ తరహా వికెట్పై బ్యాటింగ్ ఆర్డర్ కిందకు వెళుతున్నకొద్దీ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. ప్రత్యేకంగా స్లో వికెట్పై లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయన్నాడు. ఈ తరహా వికెట్పై అనుభవం తక్కువగా ఉన్న మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లకు లక్ష్యాన్ని ఛేదించడం ఎప్పుడూ కష్టతరంగానే ఉంటుందన్నాడు.

అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వారి సహజ సిద్ధమైన ఆటకు ఎప్పుడూ నిబంధనలు విధించకూడదన్నాడు. ఒకవేళ వారు తప్పులు ఏమైనా చేస్తే అనుభవపూర్వకంగా వారే నేర్చుకుంటారన్నాడు. అయితే మ్యాచ్ ఫినిషర్ జాబ్ అనేది అంత సులభమైనది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా ధోని చెప్పాడు. క్రికెట్ గేమ్లో మ్యాచ్ ఫినిషిర్గా బాధ్యతలు తీసుకోవడం కఠినమైన పనుల్లో ఒకటిగా ధోని పేర్కొన్నాడు. లోయర్ ఆర్డర్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడే ఆటగాడ్ని అన్వేషించడం కూడా కష్టమేని ధోని అభిప్రాయపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand  MS Dhoni  inexperienced middle order  ranchi  cricket  

Other Articles