చారిత్రక టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా India reclaim top Test ranking

India dethrone pakistan to become number one test team

ind vs nzl second test, Eden Garden, new zealand, rohit sharma, virat kohli, wriddhiman saha, Team India, virat kiohli, anil kumble, cricket, cricket news, India, India vs New Zealand 2016, Martin Guptill, new zealand, sports news, sports

India take an insurmountable 2-0 lead over New Zealand and reclaim the number one spot in the ICC Test rankings.

చారిత్రక టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా

Posted: 10/03/2016 07:09 PM IST
India dethrone pakistan to become number one test team

ఈడెన్ గార్డెన్ వేదికగా పర్యాటక జట్టు న్యూజిలాండ్ తో జరుగుతున్న చారిత్రక టెస్టులో భారత్ విజయం సాధించింది. నిన్నటి కాన్షూర్ మ్యాచ్ ఇండియాకు 500 వ టెస్టు కాగా, ఈడెన్ టెస్టు స్వదేశంలో జరుగుతున్న 250 టెస్టు లోనూ విజయం సాధించింది, అంతేకాదు మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లలో రెండింటిని గెలిచి సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది, ఈ విజ‌యంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్ర‌స్థానంలో నిలిచింది.

ఇంత‌వ‌ర‌కు 111 రేటింగ్స్ తో అగ్ర‌స్థానంలో ఉన్న పాకిస్థాన్ రెండో స్థానానికి ప‌డిపోయింది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా (108 రేటింగ్స్), నాలుగో స్థానంలో ఇంగ్లండ్‌(108), ఐదో స్థానంలో ద‌క్షిణాఫ్రికా(108), ఆరో స్థానంలో శ్రీ‌లంక(96) ఉన్నాయి. 376 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను ను భారత బౌలర్లు కకావికలం చేసి 178 పరుగుల విజయాన్ని అందుకున్నారు. దాంతో మూడు టెస్టుల సిరీస్ ను భారత్ 2-0 తో సాధించింది.
 
ఈ రోజు ఆటలో టీ విరామానికి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి కాస్త ఫర్వాలేదనిపించిన కివీస్.. ఆ తరువాత మూడో సెషన్ లో వరుసగా వికెట్లను కోల్పోయి పరాజయం చెందింది.  ప్రత్యేకంగా ఈ సెషన్ లో అరవై మూడు పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను నష్టపోవడంతో న్యూజిలాండ్ ఘోర ఓటమి తప్పలేదు. దాంతో కివీస్ 81.1 ఓవర్లలో 197 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. రెండో సెషన్లో సగం భాగం వరకూ పూర్తి నిలకడగా ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారిగా కీలక వికెట్లను చేజార్చుకుంది. నాల్గో రోజు ఆటలో భాగంగా లంచ్ తరువాత గప్టిల్(24) వికెట్ ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు లాథమ్-నికోలస్లు మరమ్మత్తులు చేపట్టారు.
 
అయితే నికోలస్(24)ను రెండో వికెట్ గా కోల్పోయిన తరువాత కెప్టెన్ రాస్ టేలర్(4) కూడా ఎంత సేపో క్రీజ్లో నిలబడలేదు. కాగా లాథమ్ హాఫ్ సెంచరీతో క్రీజ్ లో నిలబడి భారత బౌలర్లకు కాసేపు పరీక్ష పెట్టాడు. అయితే లాథమ్(74) నాల్గో వికెట్ గా అవుటైన తరువాత కివీస్ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టారు.  సాంట్నార్(9), వాట్లింగ్(1) స్వల్ప వ్యవధిలో నిష్ర్కమించగా, రోంచీ(32) కాసేపు పోరాడాడు. ఆపై జీతన్ పటేల్(1), హెన్రీ(18), బౌల్ట్(4) అవుట్ కావడంతో కివీస్ కు మరో ఘోర పరాజయం ఎదురైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, అశ్విన్, జడేజాలు తలో మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.

అంతకుముందు 227/8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు మరో 36 పరుగులు చేసి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. దాంతో కివీస్ కుఉ భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.  ఈ రోజు ఆటలో ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహా(58నాటౌట్;120 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.మరో ఓవర్ నైట్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ (23) బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే భువీ తొమ్మిదో వికెట్ గా అవుటైన తరువాత మహ్మద్ షమీ(1) ఎంతో సేపు క్రీజ్ లో నిలబడలేకపోవడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles