నా కెరీర్ లో అద్భుతమైన సిరీస్ అదే.. Ricky Ponting speaks on playing 2001 Test series against India

Ricky ponting speaks on playing 2001 test series against india

ricky ponting, ponting, India, Australia, Ricky Ponting, best test series, vvs laxman, rahul dravid, harbhajan singh, harbhajan, ricky ponting harbhajan singh, harbhajan singh controversies, indian cricket news, cricket news, cricket

Australian legend Ricky Ponting opened up on being a part of the “most remarkable Test series” he ever played.

నా కెరీర్ లో అద్భుతమైన సిరీస్ అదే..

Posted: 09/08/2016 05:57 PM IST
Ricky ponting speaks on playing 2001 test series against india

అస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన కెరీర్లోనే చిరస్మరణీయమైనదిగా అభివర్ణించిన టెస్టు సిరీస్ ఏదో తెలుసా..? దాదాపు 16 సంవత్సరాల క్రితం భారత్ హోం గ్రౌండ్ లో ఆడిన టెస్టు సిరీసే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పేర్కొన్నాడు. 2001లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆ దైపాక్షిక టెస్టు సిరీస్ తన కెరీర్లోనే అద్భుతమైనదని పాంటింగ్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్లో తాము ఓడినప్పటికీ, క్రికెట్ ఏ స్థాయిలో ఉండాలో అదే తరహాలో ఆ సిరీస్ జరిగిందన్నాడు. ఇటీవల ఓ సందర్బంగా తనను హర్భజన్ సింగ్ ఇప్పటికే కలలోకి వచ్చి భయపెడుతుంటాడని చెప్పిన పాంటింగ్ ఇవాళ మరికొన్ని విషయాలను గుర్తుచేసుకున్నాడు.

అయితే ఈ సిరీస్ లో కూడా ప్రత్యేకంగా కోల్ కతా నగరంలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన టెస్టు మ్యాచ్ మాత్రం సిరీస్కే హైలైట్ అని పాంటింగ్ తెలిపాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తాము భారీ ఇన్నింగ్స్ చేసి భారత్ ను ఫాలో ఆన్లోకి నెట్టినా, ఆ తరువాత ఆ జట్టు పుంజుకున్న తీరు అమోఘమన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో వీవీఎస్ లక్ష్మణ్ చేసిన  280 పరుగులు, రాహుల్ ద్రవిడ్ చేసిన 180 పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయన్నాడు. వారిద్దరి పోరాట పటిమతో ఆ మ్యాచ్ తమ చేయి జారిందని తెలిపాడు.

ఆ తరువాత చెన్నైలో చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో టెస్టు కూడా అత్యంత ఆసక్తిని రేపిందని తన గత జ్ఞాపకాల్ని పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా మరుపురాని విజయాన్ని కైవసం చేసుకుని సిరీస్ను 2-1 తో గెలుచుకుందన్నాడు. ఈ సిరీస్లో ముంబై లో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్లతో ఆస్ట్రేలియా విజయం సాధించిన తరువాత టీమిండియా పుంజుకున్న విధానం తన క్రికెట్ కెరీర్లోనే అరుదైన సిరీస్గా పాంటింగ్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  Ricky Ponting  best test series  vvs laxman  rahul dravid  

Other Articles