Anil Kumble is the right man to guide Indian cricket team, says Adam Gilchrist

Kumble kohli combo on track to improve overseas test record says adam gilchrist

ICC, West Indies-India, Indian cricket team, Anil Kumble, Virat Kohli, Gil christ, Australian legend, Team India coach, cricket, cricket news, india vs west indies, india west indies test series

Former Australian wicket-keeper said that Anil Kumble is an experienced and respected cricketer and his appointment will guide the team in the right direction

ఆ జోడీ టెస్టు క్రికెట్ లో రికార్డులు సృష్టిస్తుంది

Posted: 08/19/2016 05:06 PM IST
Kumble kohli combo on track to improve overseas test record says adam gilchrist

భారత క్రికెట్ జట్టు చీఫ్‌ కోచ్గా అనిల్ కుంబ్లేను నియమించడాన్ని ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఆడం గిల్క్రిస్ట్ ప్రశంసించాడు. అనిల్ కుంబ్లే, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాంబినేషన్లో టీమిండియా చరిత్ర సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. విదేశీ గడ్డపై టెస్టు క్రికెట్ రికార్డును టీమిండియా మెరుగుపరుచుకుంటుందని, ఇప్పటికే ఆ సంకేతాలు వెలువడ్డాయని పేర్కోన్నాడు. కుంబ్లే గౌరవనీయ క్రికెటర్గా భారత జట్టును సరైన దిశలో నడిపిస్తాడని గిల్క్రిస్ట్ చెప్పాడు. కుంబ్లే, కోహ్లీ కాంబినేషన్ బాగా పనిచేస్తుందని చెప్పడానికి.. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా సాధించిన విజయమే నిదర్శనమని అన్నాడు.

టెస్టు ఫార్మెట్ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీకి నిలదొక్కకునేందుకు కొంత సమయం అవసరమని అన్నాడు. అయితే ఆయనకు త్వరలో మూడు ఫార్మాట్లలో జట్టు పగ్గాలు అప్పగించనున్నారన్న వార్తలపై కూడా ఆయన స్పందించాడు. మూడు ఫార్మెట్ పగ్గాలను కోహ్లీకి అప్పగించి ఒత్తిడి పెంచరాదని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. 'పరిమిత ఓవర్ల కెప్టెన్గా ధోనీ ఉన్నాడు. కెప్టెన్గా అతన్ని తొలగించడానికి ఏ కారణం లేదు' అని అన్నాడు. హెడ్ కోచ్గా కుంబ్లే నియమితుడయ్యాక, కోహ్లీ సారథ్యంలో టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ గడ్డపై భారత్ ఆ జట్టును ఓడించడంతో పాటు మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles