Selfie with lion costs Ravindra Jadeja Rs. 20000 in penalty

Ravindra jadeja fined probe report still pending

Ravindra Jadeja, Jadeja lion selfie, Lion selfie jadeja, Lion photo Jadeja, Gir Wildlife Sanctuary, Ravindra Jadeja, Selfie With Lion, Hardevsinh Solanki, IPL 8, cricket streaming, cricket streaming video, cricket news, cricket

Indian cricketer Ravindra Jadeja has been fined 20,000 rupees after posting photos online of him and his wife posing in front of endangered Asiatic lions.

రవీంద్ర జడేజాకు ఫైన్.. కొనసాగుతున్న విచారణ

Posted: 08/10/2016 07:57 PM IST
Ravindra jadeja fined probe report still pending

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజాపై జరిమానా వేటు పడింది. ఐపీఎల్ మ్యాచ్ ల తరువాత తన భార్యతో కలసి గుజరాత్ వెళ్లిన ఆయన సింహాల ముందు సెల్ఫీ దిగిన కారణంగా జరుగుతున్న విచారణలో జడేజాకు జరిమానా విధించారు. సింహాల ముందు సెల్పీలు దిగిన కేసు విచారణ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తుగా మాత్రం గుజరాత్ అటవీశాఖ అధికారులు జడేజాకు రూ.20,000 జరిమానా విధించారు. జడేజా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లడంతో అతడి మామగారు హరదేవ్ సిన్హ్ సోలంకి జరిమానా చెల్లించారు. ఈ ఘటనపై దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు.

జునాఘడ్ జిల్లాలో సాసన్ వద్ద గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జూన్ 17న తన భార్య రీవా సోలంకితో కలిసి జడేజా ఫొటోలు దిగాడు. అక్కడితో ఆగకుండా మృగరాజుల ముందు సెల్ఫీలు తీసుకున్నాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఈ చర్య వ్యతిరేకం కావడంతో జడేజాకు జరిమానా విధించారు. 'జడేజా తరపున ఆయన మామగారు జరిమానా చెల్లించారు. హరదేవ్ స్టేట్మెంట్ కూడా నమోదు చేశాం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామ'ని జునాఘఢ్ అటవీ సంరక్షణ ముఖ్యాధికారి ఏపీ సింగ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindra Jadeja  Selfie With Lion  Hardevsinh Solanki  IPL 8  cricket  

Other Articles