Miss Test Cricket, But Made Right Decision: Mahendra Singh Dhoni

Miss tests but don t regret retiring says dhoni

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, anil kumble india, kumble cricket, kumble bowling, cricket, sports news, sports

MS Dhoni, India's limited-overs captain, has acknowledged that he misses playing Test cricket, but doesn't regret his decision from retiring from the longest format of the game.

టెస్టు క్రికెట్ మిస్సయినా సరైన నిర్ణయమే తీసుకున్నా..

Posted: 07/20/2016 07:05 PM IST
Miss tests but don t regret retiring says dhoni

వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉండకపోవచ్చని పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ అన్నాడు. మరికొద్ది గంటల్లో జరగనున్న తొలి టెస్టుకు ముందు ధోని మీడియాతో మాట్లాడుతూ.. భారత జట్టుకు నిలకడైన బ్యాటింగ్ లైనప్ ఉందని అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్ నుంచి విరమణ తీసుకున్న తరువాత తనకు తొలిసారిగా టెస్టులను మిస్ అవుతున్నానన్న భావన నెలకొందని తెలిపారు. అయితే తాను తీసుకున్న నిర్ణయం కూడా సరైనదేనని, దీని వల్ల తాను సంతోషంగా వున్నానని చెప్పారు. వెస్టిండీస్లో జరిగే టెస్టు సిరీస్లో కోహ్లి సారథ్యంలో టీమిండియా బరిలో దిగుతోంది.

భారత బ్యాటింగ్ లైనప్లో టాప్-6 ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారని, ఉపఖండం ఆవల ఆడిన అనుభవం ఉందని ధోనీ చెప్పాడు. తుది జట్టులోకి ఒకర్నో ఇద్దర్నో కొత్తగా తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. జట్టుకు అవసరమైనంతమంది బౌలర్లు అందుబాటులో ఉన్నారని చెప్పాడు. వెస్టిండీస్లో వికెట్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్నాడు. భారత్, విండీస్ల మధ్య గురువారం నుంచి తొలిటెస్టు జరగనుంది. 2011లో వెస్టిండీస్కు భారత్ వెళ్లినపుడు ధోనీ 1-0తో సిరీస్ను గెలిపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles