anil kumbles focus is on every player says shikhar dhawan

Along with virat kohli we all are part of anil kumble s plans says shikhar dhawan

anil kumble, virat kohli, Shikhar Dhawan, Indian coach, Ravi shastri, sourav ganguly, BCCI, Cricket

Opener Shikhar Dhawan termed new coach Anil Kumble as a "good reader of player's mind", who has kept each and every player in his plan

అదే కుంబ్లే విధానం.. వెల్లడించిన ధావన్..

Posted: 07/03/2016 07:37 PM IST
Along with virat kohli we all are part of anil kumble s plans says shikhar dhawan

టీమిండియా కోచ్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అనీల్ కుంబ్లే ఎలాంటి విధానాలను అమలు పరుస్తున్నారన్నది టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ వెలువరించాడు. ప్రతీ ఒక్క ఆటగాడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కొత్త క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రణాళికలో భాగమని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ స్పష్టం చేశాడు. అది టెస్టు కెప్టెనా లేక జట్టులో అత్యుత్తమ ఆటగాడా? అనేది కుంబ్లే ప్రణాళికలో భాగం కాదన్నాడు. 'ప్రతీ ఒక్క ఆటగాడిపైనా కుంబ్లే దృష్టి పెట్టాడు. అది అతని ప్రణాళికలో భాగం.
 
విరాట్ కోహ్లినా?లేక నేనా అనేది ముఖ్యం కాదు. ఈ తరహా విధానమే చాలా ముఖ్యం'అని ధవన్ అన్నాడు. గతంలో రవిశాస్త్రితో కలిసి పనిచేయడం కూడా తనకు ఒక మంచి అనుభవమని ధవన్ ఈ సందర్భంగా తెలిపాడు. జట్టు సభ్యులమంతా అతనితో పంచుకున్న డ్రెస్సింగ్ రూమ్ వాతావారణం నిజంగా  అద్భుతమన్నాడు.  అటు రవిశాస్త్రితో పాటు, ఇటు కుంబ్లే కూడా దిగ్గజ ఆటగాళ్లేనని... వీరితో కలిసి పని చేయడంతో అనేక విషయాలను తెలుసుకోవడానికి ఆస్కారం దొరుకుతుందని ధవన్ అన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil kumble  virat kohli  Shikhar Dhawan  Indian coach  Ravi shastri  sourav ganguly  BCCI  Cricket  

Other Articles